ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నిలిచిన వర్షపు నీరు
సాక్షి, (నల్లగొండ): జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. రామన్నపేటలో అత్యధికంగా 13.08 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి మండలం కూనూరులో విద్యుదాఘాతానికి గురై పాడి గేదె మృత్యువాతపడింది. దీని విలువ రూ.లక్ష ఉంటుందని బాధితురాలు నుచ్చు లక్ష్మి తెలిపింది. అదే విధంగా వలిగొండ మండలం దుప్పెల్లి, ఆలేరు మండలం కందిగడ్డతండాలో పిడుగుపాటుకు మూ డు గేదెలు మృతి చెందాయి. బొమ్మలరామా రం మండలంలో కూరగాయల తోటలు పాక్షికంగా దె బ్బతిన్నాయి. మర్యాల గ్రామంలో చెట్టు రోడ్డుపై కూలింది. రామన్నపేట మండలంలో పలుచోట్ల లో తట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతుకుంట మీదుగా వచ్చిన వరదతో మండల కేంద్రంలో కుమ్మరివాడ, బంటువాడలు నీట మునిగాయి. మోత్కూరులో గంటకు పైగా కురిసిన వర్షానికి వీధులు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. భూదాన్‌పోచంపల్లి మండలంలో ఉదయం 11 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దోతిగూడెం శివారులోని రసాయన కంపనీ సమీపంలో మెయిన్ రోడ్డుపై పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. స్వామి సన్నిధికి వచ్చిన భక్తులకు అవస్థలు తప్పలేదు.
రైతుల్లో హర్షం
జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పక్షం రోజులుగా చినుకు రాలకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తినవి వాడుదశకు చేరాయి. తాజాగా కురిసిన వర్షం వా టికి జీవం పోసినట్లయ్యింది. అంతేకాకుండా వ్యవసాయ భూముల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది.
రామన్నపేట మండలంలో భారీగా..
రామన్నపేట మండలంలో 16.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షానికి రామన్నపేట – కొమ్మాయిగూడెం మార్గంలో గల రైల్వే అండర్‌పాస్‌లో వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ ఆస్పత్రితో పా టు పలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నీరు నిలిచింది. మునిపంపుల – దుబ్బాక గ్రామల మధ్య కల్వర్టు పైనుంచి వరద ప్రవహించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment