శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో సుమారు పది వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. వీటిలో సుమారు 1.20 లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం రాశులు, ఆరబోసిన వడ్లు ఉండగా.. వేలాది క్వింటాళ్లు తడిసిపో యాయి.
ఆయా కేంద్రాల్లో లోతట్టు ప్రాంతంలో పోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శాలిగౌరారంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణ సీసీ ప్లాట్‌ఫాం కావడంతో ధాన్యం అత్యధికంగా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన, నీటిలో ఉన్న ధాన్యం రాశులను బయటకు తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment