భార్యను వేధిస్తున్నాడని ఓ యువకుడిపై భర్త దాడి | Husband assaults youth | Sakshi

భార్యను వేధిస్తున్నాడని ఓ యువకుడిపై భర్త దాడి

Jan 3 2024 12:21 PM | Updated on Jan 3 2024 12:21 PM

Husband assaults youth  - Sakshi

జవహర్‌నగర్‌: భార్యను ఓ యువకుడు వేధిస్తున్నాడనే కోపంతో భర్త రంపంతో దాడి చేసిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓంకార్‌ విశ్వకర్మ వృత్తి కార్పెంటర్‌. భార్యతో కలిసి జవహర్‌నగర్‌ ముత్తుస్వామి కాలనీలో దూరపు బంధువైన తులసీరాం ఇంట్లో నివసిస్తున్నారు. తులసీరాం కుమారుడు తనూ (22) ఓంకార్‌ భార్య పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేశాడు.

దీంతో ఓంకార్‌ ఆగ్రహించి..అదును కోసం వేచి చూస్తూ మంగళవారం రాత్రి భార్యతో కలిసి రంపంతో తనూపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.. స్థానికులు దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో తనూని గాంధీ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తన కుమారుడిని హత్య చేయాలని రంపంతో కొట్టిన ఓంకార్, శ్వేతలపై చర్యలు తీసుకోవాలని తనూ తండ్రి తులసీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement