assaults attack
-
భార్యను వేధిస్తున్నాడని ఓ యువకుడిపై భర్త దాడి
జవహర్‌నగర్: భార్యను ఓ యువకుడు వేధిస్తున్నాడనే కోపంతో భర్త రంపంతో దాడి చేసిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓంకార్ విశ్వకర్మ వృత్తి కార్పెంటర్. భార్యతో కలిసి జవహర్‌నగర్ ముత్తుస్వామి కాలనీలో దూరపు బంధువైన తులసీరాం ఇంట్లో నివసిస్తున్నారు. తులసీరాం కుమారుడు తనూ (22) ఓంకార్ భార్య పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో ఓంకార్ ఆగ్రహించి..అదును కోసం వేచి చూస్తూ మంగళవారం రాత్రి భార్యతో కలిసి రంపంతో తనూపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.. స్థానికులు దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో తనూని గాంధీ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తన కుమారుడిని హత్య చేయాలని రంపంతో కొట్టిన ఓంకార్, శ్వేతలపై చర్యలు తీసుకోవాలని తనూ తండ్రి తులసీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి..
విజయనగరం క్రైమ్: వరసకు కుమార్తె అయిన బాలికపై సవతి తండ్రి కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడిన దురాగతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ బాలిక విశాఖ వెళ్లినప్పుడు పక్కింటి పిన్నితో చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ‘దిశ’ పోలీసు స్టేషన్లో తల్లి ఫిర్యాదుచేసింది. రంగంలోకి దిగి న ‘దిశ’ డీఎస్పీ టి.త్రినాథ్ కేసు విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. డెంకాడ మండలానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై సవతి తండ్రి కొద్ది నెలలుగా రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవలికాలంలో భార్య, భర్తల మధ్య తగాదా రావడంతో పిల్లలను పట్టు కుని తల్లి విశాఖలో ఉంటున్న సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ పక్కనే నివాసముంటున్న మహిళతో బా లిక తన గోడును వెళ్లబోసుకుంది. భర్తతో తగా దా మంచిది కాదని సోదరుడు సర్దిచెప్పడంతో రెండురోజుల కిందటే తిరిగి తన ఇంటికి వచ్చేసింది. ఇంటికివచ్చిన తర్వాత కూడా అత్యాచారానికి ఒడిగట్టడంతో బాలిక ఫోన్లో తన పిన్నికి విషయం చెప్పింది. ఆమె వెంటనే స్పందించి తల్లికి వివరించడంతో ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన దిశ డీఎస్పీ టి.త్రినాథ్ సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పోక్సో యాక్ట్ కింద కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో కలవరపెట్టిన ఆరడుగుల శ్వేతనాగు.. -
టీడీపీ రౌడీయిజం
ఐరాల: సార్వత్రిక ఎన్నికల్లో దళితులను ఓట్లు వేయనీయకుండా తామే ఓట్లు వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఈ పర్యాయం మరింత రెచ్చిపోయారు. ఏకంగా పూతలపట్టు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థినిని చుట్టుముట్టి దాడికి తెగబడ్డారు. వారి దాడి నుంచి ఎలాగో బైటపడి వెళ్తున్న అభ్యర్థిని మళ్లీ అడ్డగించి పిడిగుద్దుల వర్షం కురిపించారు. తీవ్రగాయాలతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటన గురువారం మండలంలోని పి.కట్టకిందపల్లె పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. పోలింగ్ కేంద్రం నంబర్ 8లో అగ్రకులాల వారు తమను ఓట్లు వేయనీయడం లేదని దళితవాడ ప్రజలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుకు ఫోన్లో చెప్పడంతో ఆయన దళితులతో ఆ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికి సమయం 11.30 గంటలు. ఎంఎస్ బాబు సమస్యపై పోలింగ్ అధికారులతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దళితులు ఓటు వేయడానికి వీల్లేదంటూ వాగ్యుద్ధానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈవీఎం ను ధ్వంసం చేశారు. దాదాపు 70మంది టీడీపీకి చెందిన వారు కర్రలు, కమ్మీలతో వారిపై దాడికి తెగబడ్డారు. దీంతో ఎంఎస్ బాబు తల, ముఖం, వీపు, ఛాతీ, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. దాదాపు 40 నిమిషాల టీడీపీ నేతలు వారిపై రెచ్చిపోయారు. మండల కన్వీనర్ పి.చంద్ర శేఖర్ రెడ్డి సర్దిచెప్పేందుకు యత్నించినా ఆయనపై సైతం దాడి చేశారు. వారి దాడి నుంచి ఎలాగో బైట పడి కారులో బాబు వెళ్తుండగా అరకిలోమీటరు దూరంలోనే ఎదురుగా వాహనాలలో వచ్చి టీడీపీ నాయకులు మరోసారి అడ్డుకున్నారు. కారు వెళ్లనీయకుండా రాళ్లు అడ్డుపెట్టి, మళ్లీ దాడి చేశారు. రాళ్లతో కారు అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. అభ్యర్థి బాబు, ఆయన కుమారుడు ప్రవీణ్‌ను వెంటాడి మరీ ఇష్టానుసారంగా కొట్టారు. బాబు వద్ద రూ.40వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను సైతం లాక్కున్నారు. గన్‌మెన్ వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని గాయపడిన బాబును మరో వాహనంలో ఐరాల ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాబుపై దాడి ఘటనను నిరసిస్తూ చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన చేశారు. సాక్షి రిపోర్టర్‌గా భావించి... కట్టకిందపల్లె వద్ద టీడీపీ నేతల దాడి ఘటనను చిత్రీకరించేందుకు యత్నించిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిని సైతం టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నువ్వు సాక్షి విలేకరివా? అంటూ అతని కడుపులో తన్నారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. పోలీసుల వైఫల్యం పోలింగ్ కేంద్రం వద్ద బాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఎన్నోసార్లు ఎస్ఐ ప్రసాద్‌రావుకు ఫిర్యాదు చేసినా సకాలంలో ఆయన రాలేదని గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతం పోలీస్ స్టేషన్‌కు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా 2.15 గంటల సమయంలో ఎస్ఐ రావడం విమర్శలకు తావిచ్చింది. అప్పటికే బాబును చిత్తూరుకు తరలించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారిపై దాడి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పి.కట్టకిందపల్లె పోలింగ్ కేంద్రానికి వెళుతున్న నియోజకవర్గ ఎన్నికల అధికారి రవీంద్రను మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. వాహనం అద్దాలు పగుల కొట్టారు. వీటిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ నుంచి కెమెరా లాక్కొని వాటిని మూడు ముక్కలు చేశారు. కలెక్టర్‌కు ముందే ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం కట్టకిందపల్లె పోలింగ్ బూత్‌లో గత ఎన్నికల్లో అగ్రకులాల వారు తమను ఓటు వేయనీయడం లేదని నెల్లిమందపల్లె దళితవాడకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న్యకు గత నెలలో ఫిర్యాదు చేశారు. అధికారులు సైతం ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరైనా దళితులకు అవరోధాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఎన్నికల వేళకు సీన్ మారిపోయింది. అధికారులు ఏ చర్యలూ తీసుకోకపోవడంతో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నేతలు కాలరాచారు. -
ప్రేమ పెళ్లి చేశారని..
కళ్యాణదుర్గం: ప్రేమ పెళ్లి చేశారని అమ్మాయి తరపు బంధువులు దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు వాపోయారు. మండల పరిధిలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ, మధు, చిరంజీవి, చిత్తప్పలు దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నారని గెంజమ్మ, మల్లప్ప దంపతులతో పాటు కుమారుడు నాగరాజు, కోడలు అనితలు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు... మధు సోదరి మమత, అదే గ్రామానికి చెందిన చిత్తప్పను ప్రేమించి పెళ్ళి చేసుకుందన్నారు. ఈ పెళ్లిని తామే చేశామన్న దురుద్ధేశ్యంతో గత ఆదివారం మల్లమ్మ, మధు, చిరంజీవిలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అయితే పోలీసులు సర్దుబాటు చేసి పంపారన్నారు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మల్లమ్మ, మధు, చిరంజీవి, చిత్తప్పలు ఇంట్లోకి దూరి టీవీ, సామాన్లు ధ్వంసం చేసి తమపై దాడికి పాల్పడ్డారన్నారు. దీంతో ఆస్పత్రిలో చేరామని, మధు కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై రూరల్ ఎస్ఐ నబీరసూల్‌ను వివరణ కోరగా పెళ్లి విషయంలో రెండు వర్గాలకు సర్దిచెప్పి పంపామని, దాడి చేస్తామని బెదిరిస్తున్న వ్యక్తి అందుబాటులో లేడని, అందరినీ మరోసారి పిలిపించి సమస్య పరిష్కరిస్తామన్నారు. -
మేళ్లచెరువులో కాంగ్రెస్ నేతలపై దుండగుల దాడి
నల్గొండ: కాంగ్రెస్ నేతలపై దుండగులు దాడికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మండలం వేపలమాదారంలో గురువారం చోటుచేసుకుంది. జక్కుల శంబయ్య, సోముల నాయక్‌పై కత్తులతో దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వారిలో శంబయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థతి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.