ప్రేమ పెళ్లి చేశారని.. | bride side relatives attack on lovers family | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి చేశారని దౌర్జన్యం

Published Fri, Nov 10 2017 8:17 AM | Last Updated on Fri, Nov 10 2017 8:17 AM

bride side relatives attack on lovers family - Sakshi

కళ్యాణదుర్గం: ప్రేమ పెళ్లి చేశారని అమ్మాయి తరపు బంధువులు దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు వాపోయారు. మండల పరిధిలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ, మధు, చిరంజీవి, చిత్తప్పలు దాడి చేసి దౌర్జన్యం చేస్తున్నారని గెంజమ్మ, మల్లప్ప దంపతులతో పాటు కుమారుడు నాగరాజు, కోడలు అనితలు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు... మధు సోదరి మమత, అదే గ్రామానికి చెందిన చిత్తప్పను ప్రేమించి పెళ్ళి చేసుకుందన్నారు. ఈ పెళ్లిని తామే చేశామన్న దురుద్ధేశ్యంతో గత ఆదివారం మల్లమ్మ, మధు, చిరంజీవిలు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.

అయితే పోలీసులు సర్దుబాటు చేసి పంపారన్నారు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మల్లమ్మ, మధు, చిరంజీవి, చిత్తప్పలు ఇంట్లోకి దూరి టీవీ, సామాన్లు ధ్వంసం చేసి తమపై దాడికి పాల్పడ్డారన్నారు. దీంతో ఆస్పత్రిలో చేరామని, మధు కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని వాపోయారు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై రూరల్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ను వివరణ కోరగా పెళ్లి విషయంలో రెండు వర్గాలకు సర్దిచెప్పి పంపామని, దాడి చేస్తామని బెదిరిస్తున్న వ్యక్తి అందుబాటులో లేడని, అందరినీ మరోసారి పిలిపించి సమస్య పరిష్కరిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement