సాక్షి, హైదరాబాద్: పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలతో నింపే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరపై అనధికార బాదుడు ప్రారంభమైంది. కాలుష్య రహితం, మైలేజీ అధికంతో పాటు ధర తక్కువగా ఉండటంతో నేచురల్ గ్యాస్‌కు బాగా డిమాండ్ పెరుగుతోంది. నగరంలో కేజీ సీఎన్జీ ధర రూ.69 ఉండగా అదనంగా రూ.10 కలిపి బంకుల నిర్వాహకులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరపై నిలదీస్తే. ఇది అంతే.. అంటూ దబాయింపులకు పాల్పడుతున్నట్లు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.
స్టేషన్లకు పెరిగిన తాకిడి
మహా నగర పరిధిలోని సీఎన్జీ కేంద్రాలకు తాకిడి పెరిగింది. నగరం మొత్తం సుమారు 84 ప్రత్యేక సీఎన్జీ కేంద్రాలు ఉండగా, దాదాపు 42,705 సీఎన్జీ వాహనాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రోజువారీ సవరణలతో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో గ్యాస్ వినియోగం అధికమైంది. దీంతో కార్లు, ఆ వాహనదారులకు సీఎన్జీపై ఆసక్తి పెరిగింది.
చదవండి: బంజారాహిల్స్: డబ్బు తీసుకురాకపోతే చంపేస్తా...
ఇప్పటికే కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకులు గ్యాస్‌కు అనుగుణంగా మార్చుకుంటుండగా.. మరికొందరు అనధికారికంగానే వినియోగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో సీఎన్జీ వినియోగం విపరితంగా పెరిగింది. మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు ఉన్నప్పటికీ.. అధిక మైలేజీ ఫలితంగా సీఎన్జీపైనే వాహనాలదారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజు 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్‌జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలు, కాగా నాలుగు కిలలో వరకు, కార్ల సామర్థ్యం పది కిలోలకుగాను ఎనిమిది కిలోల వరకు గ్యాస్ నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజూ 6 వేల కిలోల వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుందన్నది అంచనా. డిమాండ్‌కు సరిపడా సీఎన్జీ సరఫరా లేదని డీలర్లు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment