సాక్షి, హైదరాబాద్ : ‘ప్రశాంత్‌కు ఆంగ్లభాషలో మంచి పట్టుంది. ఆరునెలల క్రితం వర్క్ అండ్ హైర్ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాడు. సృజనాత్మక కంటెంట్ రైటింగ్ ద్వారా ఉదయం, సాయంత్రం వేళల్లో నాలుగు గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.28 వేలు ఆర్జిస్తున్నాడు.
దీపికకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి ట్రాన్స్‌లేషన్ చేసే అంశంపై మంచి పట్టుంది. ఒకవైపు ఇంటి పని చేసుకుంటూనే ఆన్‌లైన్‌లో ఖాళీ సమయాల్లో పలు కంపెనీల ట్రాన్స్‌లేషన్లు పూర్తిచేసి నెలకు రూ.25 వేలకు పైగానే ఆర్జిస్తోంది.
ఏంటీ నయా ట్రెండ్ అనుకుంటున్నారా..?
తమ హాబీల ద్వారా ఆదాయ ఆర్జన చేసేందుకు పలువురు గ్రేటర్ సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఖాళీసమయాల్లో ఆడుతూ..పాడుతూ పనిచేస్తూ..ఫ్రీలాన్సర్‌గా డబ్బులు సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్నవారు తాము తీసిన ఫోటోలను కొన్ని వెబ్‌సైట్లలో తేలికగా విక్రయించుకొని ఆదాయం ఆర్జిస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సేవారంగంలో కొత్త తరహా వెబ్‌సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. డోర్ స్టెప్ సర్వీసులు అందిస్తున్నాయి. అర్బన్ క్లాప్ డాట్ కామ్, తదితర వెబ్ సైట్లు కూడా సర్వీసులు అందిస్తూనే ప్రొఫెషనల్స్‌కు జాబ్ అవకాశాలు అందిస్తుండడం విశేషం.
జాబ్‌లు ఇలా..
► హబీకి..టాలెంట్‌కు తగిన ఉద్యోగాన్ని వెదికిపెట్టే వెబ్‌సైట్లు బోలెడు అదుబాటులోకి వచ్చాయి.
►ఖాళీ సమయాల్లోనూ కాసులు కురిపించే ఉద్యోగాలను ఇంటి నుంచి కాలు కదపకుండా సంపాదించుకునే ఉద్యోగాలకే సిటీజన్లు ఓటేస్తున్నారు .
►గృహిణులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వృత్తినిపుణులు ఇలా..మహానగరం పరిధిలో ఇలా ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేస్తూ నెలకు పది వేల నుంచి లక్షకు పైగా ఆర్జిస్తున్నవారు వేలాదిమంది ఉన్నారు.
►ప్రధానంగా మెడికల్ ట్రాన్స్‌స్కిప్షన్, ట్రాన్స్‌లేషన్, ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్, ఫోటోగ్రఫి, ట్రావెల్ ఎక్స్‌పర్ట్, ఫుడ్‌బ్లాగర్, ఇంటీరియర్ డిజైనింగ్, మొబైల్ యాప్ తయారీ, వెబ్‌సైట్ మేకప్ తదితర ఫ్రీలాన్స్ జాబ్స్‌కు సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారు.
►మహానగరం పరిధిలో ఇంటర్నెట్ వినియోగం 80 శాతానికి పైగా ఉండడంతో ఈ ఫ్రీలాన్స్ జాబ్స్‌కు క్రేజ్ పెరిగిపోయింది.
వెబ్‌సైట్లు కొన్ని..
అప్‌వర్క్, వర్క్ అండ్ హైర్, ఫ్రీలాన్సర్.కామ్, ట్రూలాన్సర్, ఫైవర్, వీటికితోడు రెగ్యులర్ జాబ్ వెబ్‌సైట్స్ అయిన షైన్, లింక్డిన్, ఇండీడ్ లాంటి వాటిలోనూ ఫ్రీలాన్స్ జాబ్స్ వెతుక్కునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment