సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటి నా వేడిగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమో దవుతుండగా వచ్చే మూడు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... కొన్ని జిల్లాల్లో 42ని–44 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
అలాగే మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38–41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని వివరించింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
సోమ వారం నల్లగొండలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలంలో 43.2 డిగ్రీలు, ఖమ్మంలో 43 డిగ్రీల చొప్పు న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వడదెబ్బకు గురై హనుమ కొండ జిల్లాలో ముస్కుపెంటు(52)అనే ఉపాధి హామీ కూలీ, మంచిర్యాల జిల్లాలో సంతోష్కుమార్ (36) అనే కానిస్టేబుల్ మృతి చెందారు.
మరోవైపు రాష్ట్ర ప్రణాళికా విభా గం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నల్లగొండ జిల్లా దామరచర్ల 45.3 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ 45.1 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నిడ మానూరులో 44.9 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి, రామగుండంలో 44.4 డిగ్రీల చొప్పున, జగిత్యాల జిల్లా జైనా, కరీంనగర్ జిల్లా వీణవంక, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 44.3 డిగ్రీల చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఏపీలో కూడా వడగాడ్పులు, ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment