
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన చైతన్య పోలోజు ప్రతిష్టాత్మకమైన మిసెస్ గ్లోబల్ షో టాపర్–2020గా నిలిచారు. అమెరికాలో వర్చువల్‌గా నిర్వహించిన మిసెస్ గ్లోబల్ షో పోటీల్లో తెలంగాణకు చెందిన ఎన్నారై మహిళ చైతన్య ఈ కిరీటాన్ని అందుకున్నారు. 2019లో జరిగిన మిసెస్ భారత్ న్యూయార్క్ పోటీల్లోనూ ఆమె విజేతగా నిలిచారు. ప్రస్తుతం ప్రపంచ తెలుగు కల్చరల్ ఫెస్టివల్‌కు ఆమె అందాల సుందరి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. మై డ్రీం గ్లోబల్ ఫౌండేషన్ వర్జీనియా చాప్టర్ కో ఆర్డినేటర్‌గానూ సేవలందజేస్తున్నారు. టాటా వారి “తారల ఇంట్లో సందడి’ షోలో స్పెషల్ గెస్ట్‌గా, జ్యూరీగానూ వ్యవహరించారు. బంజారా మహిళా ఎన్జీవో వంటి సంస్థలతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment