misses
-
మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రేసులో సిక్కోలు మహిళ
శ్రీకాకుళం: మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రేసులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి రజని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మిసెస్, మిస్ విభాగాలకు జరుగుతున్న పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలున్నారు. సామాజిక సేవలు, కళలు, మహిళా సాధికారత, విద్యార్హతలాంటి అంశాలపై గత ఆరు నెలలుగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఓటింగ్ రేసు వరకు వచ్చేశారు. మిసెస్ ఆంధ్రప్రదేశ్ రేసులో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పైడి రజని ఒక్కరే ఉన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంగ్లిష్ విభాగం స్కాలర్ అయిన ఈమె విశాఖ ఏవీఎన్ కళాశాలలో కొన్నేళ్లుగా లెక్చరర్‌గా సేవలందిస్తున్నారు. జేసీఐ ఫెమీనా అధ్యక్షురాలిగా పలు అవార్డులు సాధించారు. సంప్రదాయ నాట్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్న ఈమె గత కొన్నేళ్లుగా శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ (సేవ) స్థాపించి క్యాన్సర్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, అనాథాశ్రమంలో చిన్నారులు, మానసిక వికలాంగులు, వృద్ధాశ్రమంలో వృద్ధులు, నిరుపేదలకు పెద్ద ఎత్తున కొన్నేళ్లుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఆన్లైన్ ఓటింగ్ రేసు వరకు రజని రావడం ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరే ఉండడంతో అన్ని వర్గాలకు చెందినవారు ఆన్లైన్లో పైడి రజనికి మద్దతు పలుకుతున్నారు. బుధవారం రాత్రి ఆన్లైన్ ఓటింగ్‌కు నిర్వాహకులు అనుమతి ఇవ్వగా గురువారం నుంచి ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఆన్లైన్లో సీ–15కు ఓటువేసి రజనికి మద్దతు పలకాలని శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ (సేవ) సభ్యులు, లయన్స్, జేసీస్, రోటరీ, వాకర్స్‌క్లబ్, మీడియా సంఘాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, విద్యార్థులు సోషల్ మీడియాలో అభ్యరర్తిస్తున్నారు. మద్దతు పలకాలంటే mrsitap2021.com ను క్లిక్ చేసి ‘సి15’కు ఓటెయ్యొచ్చు. -
మిసెస్ గ్లోబల్ షో టాపర్‌గా చైతన్య
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన చైతన్య పోలోజు ప్రతిష్టాత్మకమైన మిసెస్ గ్లోబల్ షో టాపర్–2020గా నిలిచారు. అమెరికాలో వర్చువల్‌గా నిర్వహించిన మిసెస్ గ్లోబల్ షో పోటీల్లో తెలంగాణకు చెందిన ఎన్నారై మహిళ చైతన్య ఈ కిరీటాన్ని అందుకున్నారు. 2019లో జరిగిన మిసెస్ భారత్ న్యూయార్క్ పోటీల్లోనూ ఆమె విజేతగా నిలిచారు. ప్రస్తుతం ప్రపంచ తెలుగు కల్చరల్ ఫెస్టివల్‌కు ఆమె అందాల సుందరి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. మై డ్రీం గ్లోబల్ ఫౌండేషన్ వర్జీనియా చాప్టర్ కో ఆర్డినేటర్‌గానూ సేవలందజేస్తున్నారు. టాటా వారి “తారల ఇంట్లో సందడి’ షోలో స్పెషల్ గెస్ట్‌గా, జ్యూరీగానూ వ్యవహరించారు. బంజారా మహిళా ఎన్జీవో వంటి సంస్థలతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
నగరవాసికి అందాల కిరీటం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మిసెస్ భారత్ పోటీలలో ఈ సంవత్సరానికి గాను తెలుగు మహిళ చైతన్య పోలోజు ఈ కిరీటాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని విజేత సంబంధీకులు ఓ ప్రకటనలో తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 21న ఈ పోటీ జరిగింది. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ మహిళ, పెళ్లికి మాత్రమే పరిమితమనే ఆలోచనను అందరిలో దూరం చేయడమే తన ధ్యేయమని, తన ఆశయాల సాధనలో తండ్రి ఆంజనేయులు భర్త సాయిరాం తోడవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలో మొదటి రన్నర్ అప్ గా కిస్మత్ బైన్స్ చాహల్, రెండవ రన్నర్ అప్ గా సీమ సింగ్ గెలుపొందగా, ప్రముఖ బాలీవుడ్ నటి షమిత శెట్టి ముఖ్య అతిథిగా, మై డ్రీం ఎంటర్ టైన్మెం రష్మి బేడి – జనక్ బేడిలు తదితరులు పాల్గొన్నారు. -
‘మిస్సెస్ యూనివర్స్’ ఫైనల్‌కు సిటీ వనిత
పంజగుట్ట: నగరానికి చెందిన రోహిణి నాయుడు ‘మిస్సెస్ యూనివర్స్’ ఫైనల్‌కు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనతను సాధించినఏకైక మహిళగా నిలిచిన ఆమె.. అక్టోబర్‌లో గ్రీస్ దేశంలో జరిగే పోటీల్లో టైటిల్ పోరులో తలపడనున్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిణి మాట్లాడారు. మిస్సెస్ యూనివర్స్ పోటీలకు వివిధ దేశాల నుంచి 30 వేల ఎంట్రీలు రాగా 172 మందిని ఫైనల్స్‌కు ఎంపికచేశారన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తాను ఒక్కదాన్నేఎంపికైనందుకు గర్వంగా ఉందన్నారు. ఫైనల్స్‌లో సత్తా చాటి నగరానికి టైటిల్ తీసుకుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. పోటీల్లో భాగంగా మహిళా సాధికారత, జెండర్ ఈక్వాలిటీ, అపోహలు తొలగించడం అనే అంశాలపై టాస్క్‌లు చేసి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. -
మిసెస్ ఇండియా పోటీల్లో విశాఖ కెరటం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఇండియన్ ఫ్యాషన్ ఫియెస్టా పేరున జైపూర్‌లో నిర్వహించిన మిసెస్ ఇండియా– 2019 అందాల పోటీల్లో విశాఖ సోయగానికి న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. దాంతో నగర యువతి షాలిని రెండు సబ్‌టైటిల్స్‌ను గెలుచుకున్నారు. నగరానికి చెందిన షాలినీ బిస్త్, మిసెస్ ఇండియా అవుట్ స్టాండింగ్, సెనోరిటా అనే టైటిల్స్ దక్కించుకున్నారు. ఈమె గతంలో మిసెస్ వైజాగ్–2018 రన్నరప్‌గా నిలిచారు. షాలిని మల్కాపురంలోని సెయింట్ జోసెఫ్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ ఉండడం విశేషం. ఈమె భర్త భారత నావికాదళంలో సేవలందిస్తున్నారు. పోటీలో పాల్గొనేందుకు తన కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రోత్సహించారని షాలిని చెప్పారు. గతంలో హామ్స్‌షైర్ ఈవెంట్స్ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నప్పుడు కూడా వారి అండదండలు అద్భుతమని చెప్పారు. -
'గీతా' గానం చిరస్మరణీయం!
ఓ ప్రత్యేకమైన హస్కీ వాయిస్ తో పాటలు పాడి లక్షలాది అభిమానులను సంపాదించుకున్న గాయని గీతాదత్. ఆమె మరణించడం ఎంతో విషాదకరం. ఆమె మృతిచెంది 44 సంవత్సరాలయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం చిరస్మరణీయం అంటూ గాన కోకిల లతామంగేష్కర్ గుర్తు చేసుకున్నారు. జూలై 19న గీతా మరణించిన రోజు కావడంతో ఆమెను ఎంతో మిస్ అయ్యాం అంటూ లతా తన జ్ఞాపకాలను ట్వీట్ లో పంచుకున్నారు. గీతా దత్ ఎంతో మంచి గాయకురాలని, అభిమానుల మనసులో నిలిచిపోయిన 'హమ్ పంఛీ మస్తానే', 'అంకియాన్ భూల్ గయీహై సోనా', 'క్యా బతావూం మొహబ్బత్ హై క్యా' వంటి ఎన్నో యుగళ గీతాలను ఆమెతో కలసి పాడానని గీతా పుణ్యతిథిరోజున లతా మంగేష్కర్ గుర్తుకు తెచ్చుకున్నారు. గీతా లేకుండా 44 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఆమెను ఎంతో మిస్ అవుతున్న ఫీలింగ్ అంటూ లతా ట్వీట్ చేశారు. 1947 నుంచి దత్ తనకు ఎంతో మంచి స్నేహితురాలని లతా మంగేష్కర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం 86 ఏళ్ళున్న మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్.. 1959 లో విడుదలైన చిత్రం 'కాగజ్ కే ఫూల్' లో దత్ పాడిన పాట.. 'వక్త్ నే కియా క్యా హసీన్ సితాం' లింకు ను తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. గీతా దత్ జీవించినది 41 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో పాటలు పాడకపోయినా, పాడినవి మాత్రం అభిమానులు ఎన్నటికీ మరువలేనివే. ఒక్కసారి ఆమె గొంతు విన్నవారెవరూ మర్చిపోలేరు. 1930 నవంబర్ లో పుట్టిన గీతా దత్.. 1972 జూలైలో లివర్ సిరోసిస్ తో మరణించారు.