నగరవాసికి అందాల కిరీటం | Misses New York City to Hyderabad Women | Sakshi
Sakshi News home page

నగరవాసికి అందాల కిరీటం

Published Fri, May 24 2019 10:11 AM | Last Updated on Fri, May 24 2019 10:11 AM

Misses New York City to Hyderabad Women - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మిసెస్‌ భారత్‌ పోటీలలో ఈ సంవత్సరానికి గాను తెలుగు మహిళ చైతన్య పోలోజు ఈ కిరీటాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని విజేత సంబంధీకులు ఓ ప్రకటనలో తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 21న ఈ పోటీ జరిగింది. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ మహిళ, పెళ్లికి మాత్రమే పరిమితమనే ఆలోచనను అందరిలో దూరం చేయడమే తన ధ్యేయమని, తన ఆశయాల సాధనలో తండ్రి ఆంజనేయులు భర్త సాయిరాం తోడవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలో మొదటి రన్నర్‌ అప్‌ గా కిస్మత్‌ బైన్స్‌ చాహల్, రెండవ రన్నర్‌ అప్‌ గా సీమ సింగ్‌ గెలుపొందగా, ప్రముఖ బాలీవుడ్‌ నటి షమిత శెట్టి ముఖ్య అతిథిగా, మై డ్రీం ఎంటర్‌ టైన్మెం రష్మి బేడి – జనక్‌ బేడిలు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement