న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు మరో పది రోజులే సమయముందనగా న్యూయార్క్ టైమ్స్, సియెనా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే శుక్రవారం(అక్టోబర్ 25) ఆసక్తికర విషయం వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి హారిస్ పట్ల ప్రజలు సమానంగా మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది.
ఇద్దరికీ సరిగ్గా చెరో 48 శాతం పాపులర్ ఓట్ రానుందని తేలినట్లు ప్రకటించింది. అక్టోబర్ మొదటి వారంలో హారిస్‌కు 49 పాపులర్ ఓట్ అనుకూలంగా ఉండగా ట్రంప్‌కు 46 శాతం మంది మదతిచ్చారు. అయితే క్రమంగా ట్రంప్ పుంజుకొని హారిస్ రేసులో సమాన స్థాయికి రావడం గమనార్హం. ఏది ఏమైనా నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ ఎవరన్నది తేలనుంది.
ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం.. అందరికీ అర్థమయ్యే రీతిలో
Comments
Please login to add a commentAdd a comment