
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న పరీక్షల తేదీలు మారక తప్పేలా లేదు. ఈనెల 5న నిర్వహించిన ఏఈ పరీక్ష రద్దు కాగా.. ఈనెల 12, 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు రద్దయ్యాయి. ఇదే సమయంలో వచ్చే నెలలో జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షల నిర్వహణపైనా అనుమానాలు నెలకొన్నాయి.
కొత్తగా ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్ష నిర్వహించేందుకు మరింత సమయం పట్టనుంది. ఈ క్రమంలో పరీక్ష తేదీల్లో మార్పులు తప్పవని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం మాత్రం ఇప్పటికీ వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment