సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ పాఠశాలలు గొప్పగా ఉన్నాయని ఓవైపు చెప్పుకొంటున్నప్పటికీ, 28 లక్షల మంది ఉండే ప్రభుత్వబడుల విద్యార్థుల సంఖ్య 22 లక్షలకు పడిపోయిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తున్నట్టు లేదని బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ అక్షరాస్యత జాబితా లో మన రాష్ట్రం కింది నుంచి నాలుగో స్థానంలో ఉందని గుర్తించాలన్నారు.
శుక్రవారం శాసనసభలో విద్య–వైద్యంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. 2218 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, బాసర ఐఐఐటీలో పూర్తిస్థాయి నియామకాలు లేక పరిస్థితి దిగజారుతోందన్నారు. ఈటల ప్రసంగానికి మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘రెండేళ్ల క్రితం ఈటల రాజేందర్.. తాను చదువుకున్నప్పుడు పురుగుల అ న్నం తిన్నానని, కేసీఆర్ వల్ల ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు నాణ్యమైన సన్న బియ్యం బువ్వ తింటున్నారని అన్నారు. ఇటు నుంచి అటు ఆయన మారగానే ఇక్కడ పరిస్థితులు దిగజారిపోయాయా?’అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment