మలక్‌పేట: ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగం జోలికి వస్తే పతనం కాక తప్పదని తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల మహేష్‌కుమార్ అన్నారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన విద్యార్థి నాయకులతో కలిసి శనివారం మూసారంబాగ్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగంపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మనువాద కుట్రలను తిప్పికొట్టడానికి దళిత, బహుజనులు సిద్ధం ఉన్నారన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ అధ్యక్షుడు నక్క వెంకటేష్, బీసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వడ్డేపల్లి రాకేష్, గ్యార సతీష్, మేడి నాగరాజు, అశోక్, సాయికిరణ్ యాదవ్, రవివర్మ, మారుతి, రాజు, ప్రదీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment