
స్వామీజీ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న కిషన్‌రెడ్డి
కాచిగూడ: దేశవ్యాప్తంగా ఆగష్టు 13, 14, 15 తేదీల్లో 25 కోట్ల జాతీయ జెండాలను ఎగురవేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఉడిపి శ్రీ పేజావర మఠాధీశుల 35వ చాతుర్మాస దీక్షలో భాగంగా ఉడిపి పేజావర ఫీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ నగరానికి వచ్చిన సందర్భంగా శనివారం బర్కత్‌పురలో స్వామీజీని కలిసి కిషన్‌రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు సమరశీలంగా స్వాతంత్య్ర ఉద్యమం సాగిందని ఆయన గుర్తుచేశారు. దేశంలోని ప్రజలంతా వాడవాడల్లో, వీధుల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment