సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మునుగోడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మునుగోడులో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
అమిత్ షా పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హోం మంత్రి అమిత్ షాతో నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్.. ఆదివారం రాత్రి 7:30 గంటలకు నోవాటెల్ హోటల్‌లో 15 నిమిషాల పాటు సమావేశం అవనున్నారు. కాగా, అమిత్ షా ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూశారని.. సినిమాలో ఎన్టీఆర్ నటనకు మెచ్చుకుని ఆహ్వానించినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: మునుగోడుపై ప్లాన్ మార్చిన కాంగ్రెస్.. ప్రియాంక కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment