![Kalvakuntla Kavitha Takes Oath As MLC - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/29/kavitha.jpg.webp?itok=2CP4q3_s)
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శాసనసమండలి దర్బార్ హాల్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి , సత్యవతి రాథోడ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ( తెలంగాణ భవన్‌లో ‘టెక్ సెల్’)
కాగా, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 672 ఓట్ల భారీ మెజారిటీ దక్కించుకున్నారు. బరిలో నిలిచిన బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోయింది. 728 (88%) మొదటి ప్రాధాన్యత ఓట్లు కవితకే దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment