సాక్షి,కరీంనగర్: కరీంనగర్ తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి ఎంపీ బండి సంజయ్‌కు ఆహ్వానం అందకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. తన ప్రోటోకాల్ మర్యాద విస్మరించి అవమానపరుస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ఆమోదించి 8 నెలలైనా ఇన్నాళ్లపాటు ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. సొమ్ము కేంద్రానిదైతే... సోకు మాత్రం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసుకోవడం.. సిగ్గు అనిపించడం లేదా అంటూ మండిపడ్డారు.
ఆర్వోబీ నిర్మాణ ఖర్చంతా కేంద్రమే భరించేలా తాను ఒప్పించానని.. అయితే శంకుస్థాపనకు తనను ఆహ్వానించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వరంగల్ –కరీంనగర్, ఎల్కతుర్తి-సిద్దిపేట, కరీంనగర్ –జగిత్యాల రహదారి విస్తరణ పనులకు 8 ఏళ్లుగా నిధులెందుకు సాధించలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిధులెందుకు తీసుకురాలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ ప్రజలకు ఎవరెంటో అన్నీ తెలుసని వ్యాఖ్యానించారు.
చదవండి: కారు.. వీధిపోరు! 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వ సమస్య
Comments
Please login to add a commentAdd a comment