సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆ పిటిషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని పునరుద్ఘటించారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను ప్రతివాదులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment