ఖమ్మంమయూరిసెంటర్ : ఖమ్మం పాత మున్సిపల్ కార్యాలయంలోని బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా పరీక్షలు చేయించుకున్న పలువురితో ఆయన మాట్లాడారు. ఈక్రమంలో వృద్ధురాలు పద్మతో ‘కళ్లజోడు పెట్టుకున్నావు కదా మంగా కనిపిస్తోందా’ అని ఆరా తీశారు.
దీంతో ఆమె స్పందిస్త ‘మంచిగా కనబడుతుంది కొడకా.. దండం పెడతా’ అంటూ సమాధానం చెప్పారు. ‘నాకు కొడుకులు లేరు.. కంటి పరీక్షలు ఉతంగా చేయడమే కాక అద్దాలు ఇప్పించి కేసీఆరే నా కొడుకు’ అని ఆమె సమాధానం చెప్పడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దృష్టి లోపాలను దూరం చేసి, అంధ రహిత సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పువ్వాడ ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment