
ఖమ్మం మయూరి సెంటర్: ఇంగ్లండ్ దేశంలోని హోకింగ్ హోం టౌన్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన నాగెండ్ల నాగేంద్ర సత్తాచాటారు. లేబర్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
వివరాల ప్రకారం.. ఖమ్మం జర్నలిస్టు కాలనీకి చెందిన నాగెండ్ల శివానంద కుమారుడు నాగెండ్ల నాగేంద్ర ఇంగ్లండ్‌లో నివసిస్తున్నారు. అక్కడ ఈనెల 4న జరిగిన హోకింగ్ హోం టౌన్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆయన లేబర్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర తన వార్డులో అత్యధిక ఓట్లు సాధించగా.. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. తనకు సహకరించిన లేబర్ పార్టీ నాయకురాలు అండ్లీ క్లోయ్, పార్టీ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపిన నాగేంద్ర.. వచ్చే వారం తాను విధుల్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు శనివారం ఫోన్‌లో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో డబుల్ ఓట్ ఇక ఔట్!
Comments
Please login to add a commentAdd a comment