సాక్షి, హైదరాబాద్ : అత్యంత వేగంగా కరోనా వైరస్ విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని సూచించారు. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య వసతులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టిమ్స్‌లోని వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు. (‘టిమ్స్ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి’)
అలాగే కరోనాను కట్టడి చేస్తోన్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బందికి జీతాలతోపాటు, అదనంగా ఇన్సెంటీవ్స్ అందించాలని కోరారు. కరోనా బారిన పడిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, బయట తిరుగుతోన్న హోమ్ ఐసోలేషన్లో పేషెంట్స్‌ను ప్రభుత్వం గుర్తించాలన్నారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు ఇంటి గడప దాటి బయటకు రావొద్దని, ఆగస్టు ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని కిషన్‌రెడ్డి సూచించారు. (57 వేలకు పైగా కేసులు.. 36వేలు మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment