సాక్షి, న్యూఢిల్లీ: కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం మరోసారి ప్రధానితో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు వీరి భేటీ జరిగింది.
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలు అంశాల కోసం ఇప్పటికే పలుమార్లు ప్రధానిని కలిసిన కోమటిరెడ్డి ఈసారి మూసీ ప్రక్షాళనపై కేంద్రం దృష్టి సారించాలని కోరినట్లు తెలుస్తోంది.
కాగా, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గంగానది ప్రక్షాళన కోసం నమామి గంగే ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే.ఈపరిస్థితుల్లో రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో ప్రవహించే మూసీ నది ప్రక్షాళనకు కనీసం రూ.3వేల కోట్లు విడుదల చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని కోరినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment