
సాక్షి, హైదరాబాద్: రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు సాధనలో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో రామప్ప ఆలయం ప్రపంచ పర్యాటక ప్రాంతం అవు తుందన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. రామప్ప ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎర్రబెల్లి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రామప్ప ఆలయం చిత్రపటాన్ని బహూకరించారు. కేటీఆర్‌ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర సోషల్‌మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి, లింగాలఘణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment