సాక్షి, హైదరాబాద్: లగచర్ల కేసులో అరెస్టయి జైలులో ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ అయ్యారు. చర్లపల్లి జైలుకు వెళ్లిన కేటీఆర్ పట్నం నరేందర్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి పట్నం నరేందర్ రెడ్డి జైలు పాలయ్యాడరని వ్యాఖ్యానించారు.
పట్నం మాతో ఒకే విషయాన్ని ప్రస్తావించారు. నా గురించి వదిలేయండి.. చేయని తప్పుకు జైల్లో ఉన్న 30 మంది రైతులను విడిపించాలని కోరారు, గిరిజన దళిత రైతుల భూములను గుంజుకుంటున్నారని.. రైతులకు అండగా నిలవాలని కోరారు.’’ అని కేటీఆర్ చెప్పారు.
సంగారెడ్డి జైలు నుంచి మొదలుపెడితే చర్లపల్లి జైలు దాకా అమాయకులు జైల్లో ఉన్నారు. కొడంగల్ నుంచి కొండరెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్నవారు గద్దెకి కూర్చున్నారు. భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి ఆడవాళ్లు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా అరాచకాలు చేస్తోంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సొంత ఊర్లో నిన్న సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ మృతి చెందారు. ఇంటిముందు దారి లేకుండా గోడలు కడితే మానసిక క్షోభకి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత ఊరు, నా సొంత నియోజకవర్గం అని ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు చూస్తూ ఉండరు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment