కాలినడకన వెళ్తున్న రాజేశ్
ధారూరు/వికారాబాద్: లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా సిల్లీ సమాధానం చెప్పిన ఓ మెడికల్ షాపు నిర్వాహకుడి బైక్‌ను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ధారూరులో మెడికల్ షాపు నిర్వహించే రాజేశ్ ఆదివారం బైక్‌పై వికారాబాద్ వెళ్తుండగా పోలీసులు ఆపి వివరాలు అడిగారు. అయితే మందుల దుకాణంలో చిల్లర లేదని, వికారాబాద్ వెళ్లి తెచ్చుకుంటానని చెప్పడంతో పోలీసులు బైక్‌ను సీజ్ చేశారు.
దీన్ని నిరసిస్తూ రాజేశ్ కాలినడకన బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని జిల్లా మెడికల్ అసోసియేషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వచ్చి మరో బైక్‌పై అతన్ని ఏఎస్పీ రషీద్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే లాక్‌డౌన్ అమలులో భాగంగానే పోలీసులు బైక్ సీజ్ చేశారని, పాసులు లేనివారిని అనుమతించేది లేదని ఏఎస్పీ చెప్పారు. ఇదిలా ఉండగా తాను మందుల కోసం వెళ్తున్నానని చెప్పినా పోలీసులు బైక్ ఇవ్వలేదని రాజేశ్ ఆరోపించాడు.
(చదవండి: ఓరి నాయనో.. డెలివరీ బాయ్స్‌లా వేషం, బ్యాగ్‌లో ఫుడ్ కూడా!)
Comments
Please login to add a commentAdd a comment