
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న మరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చే యాలని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని కోరారు. మిగతా జిల్లాల్లో కేసులు బాగా తగ్గాయని, అక్కడ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిందని వివరించారు. కరోనావ్యాప్తి, లాక్‌డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో 8 గంటల పాటు సుదీ ర్ఘ సమీక్ష నిర్వహించారు.
వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నిబంధనల సడలింపు అంశాలు చర్చకు వచ్చాయి. సోమవారం మూడే కేసులు నమోదు కావడం, 40 మంది కో లుకోవడం శుభసూచకమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సం దర్భంగా వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి తాజా పరిస్థితి పై నివేదిక సమర్పించారు. దీనిపై మంగళవారం కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ ఆంక్షలు, వైరస్ వ్యాప్తి తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment