Four districts
-
వడివడిగా హాయివే.. పామర్రు నుంచి దిగమర్రు వరకు 4 లేన్ల ప్రయాణానికి సిద్ధం
ఆకివీడు: నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే ఎన్‌హెచ్ 165 డెల్టా ప్రాంతానికి కీలకం. పామర్రు–(పీపీ) రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ రెండు దశాబ్దాల క్రితం విలీనం చేసుకుంది. అయితే రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ రోడ్డు అభివృద్ధికి అప్పటి కేంద్ర మంత్రి ఆకివీడులో భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమ గోదావరి పాలకొల్లు మండలం దిగమర్రు వరకూ 107 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రూ.1,275 కోట్లు కేటాయించారు. రహదారి విస్తరణ కోసం సరిహద్దు భూముల సేకరణపై కొంత మంది రైతులు, స్థల యజమానులు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చొరవతో ఈ పనుల్లో మళ్లీ పురోగతి కనిపిస్తోంది. రెండు దశల్లో పనుల నిర్వహణ.. ఈ మొత్తం రహదారి పనులను రెండు ఫేజ్‌లుగా విడదీసి పనులు వేగవంతం చేశారు. పామర్రు నుంచి ఆకివీడు 64 కిలోమీటర్ల మేర ఒక ఫేజ్, అలాగే ఆకివీడు నుంచి దిగమర్రు వరకూ 43 కిలోమీటర్ల మేర మరో ఫేజ్‌లో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పామర్రు నుంచి ఆకివీడు వరకూ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 90 కల్వర్టుల నిర్మాణం.. పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వరకూ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేశారు. రూ.273 కోట్లతో పనులను చేపడుతున్నారు. దీనిలో కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల పరిధిలో 90 కల్వర్టులు, 16 వంతెనలు, 2 మేజర్ బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పలు చోట్ల రహదారి విస్తరణ పనులను చేపట్టారు. గుడివాడ, ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆకివీడు నుంచి దిగమర్రుపై కోర్టు వివాదం ఆకివీడు ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణపై కోర్టు వివాదం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రహదారికి రెట్టింపు భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల మూడు లైన్లకు అనుకూలంగా జాతీయ రహదారి భూమి ఉంది. మరికొన్ని చోట్ల రెండు లైన్ల రోడ్డే ఉంది. దీంతో ఆకివీడు, ఉండి, భీమవరం, వీరవాసరం, లంకలకోడేరు ప్రాంతాల్లో భూసేకరణకు ఎన్‌హెచ్ అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమానులకు, ఎన్‌హెచ్ అధికారుల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని యజమానులు కోర్టును ఆశ్రయించారు. నాలుగు జిల్లాలకు మేలు.. ఎన్‌హెచ్ 165 నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు ఈ ప్రాంతంలో చేపట్టడం ద్వారా రహదారి మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు పేర్కొంటున్నారు. దిగమర్రు వరకు రహదారి పనులు పూర్తయితే అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు రహదారి అనుసంధానమవుతుందని.. దీని ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలకు మేలు చేకూరుతుందని వివరిస్తున్నారు. వేగంగా పనులు కృష్ణా జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–165 రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వంతెన వరకూ రూ.273 కోట్లతో పనులు చేపడుతున్నాం. 90 కల్వర్టులు, రెండు మేజర్ వంతెనల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. –ఎం.సత్యనారాయణరావు, DE, NH, కృష్ణా జిల్లా కోర్టు అనుమతి రావాలి.. ఎన్‌హెచ్ 165 రహదారికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ పనులకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది. పలు చోట్ల రహదారి విస్తరణకు అవసరమయ్యే స్థల సేకరణపై సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లారు. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే 165 రహదారి వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలున్నాయి. – శ్రీనివాసరావు, DE, NH, పశ్చిమ గోదావరి జిల్లా -
4 జిల్లాల్లో సడలింపులొద్దు!
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న మరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చే యాలని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని కోరారు. మిగతా జిల్లాల్లో కేసులు బాగా తగ్గాయని, అక్కడ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిందని వివరించారు. కరోనావ్యాప్తి, లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో 8 గంటల పాటు సుదీ ర్ఘ సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నిబంధనల సడలింపు అంశాలు చర్చకు వచ్చాయి. సోమవారం మూడే కేసులు నమోదు కావడం, 40 మంది కో లుకోవడం శుభసూచకమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సం దర్భంగా వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి తాజా పరిస్థితి పై నివేదిక సమర్పించారు. దీనిపై మంగళవారం కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. లాక్డౌన్ ఆంక్షలు, వైరస్ వ్యాప్తి తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. -
కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నాలుగు జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అదికూడా ఆ నాలుగు జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ్యాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో 893 కేసులు నమోదు కాగా, పైన పేర్కొన్న నాలుగు జిల్లాల్లోనే 590 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,034 టెస్టులు చేశారు. టెస్టులు, పాజిటివ్ కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఇన్ఫెక్షన్ రేటు 1.85 శాతం మాత్రమే. డిశ్చార్జి అయ్యే పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆ రెండు జిల్లాల్లో ఒక్క కేసూ లేదు ► విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తూర్పుగోదావరి, విశాఖపట్నం వంటి జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ నియంత్రణలోనే ఉంది. ► కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 17,884 నమూనాలను పరీక్షించారు. ఇందులో 590 పాజిటివ్ కాగా, మిగతా 17,294 కేసులు నెగిటివ్‌గా తేలాయి. ► రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఒక్క కర్నూలు జిల్లాలోనే 26.20 శాతం, గుంటూరు జిల్లాలో 21.83 శాతం కేసులు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 48.03 శాతం కేసులు నమోదయ్యాయి. గ్రీన్ జోన్లో 573 మండలాలు : డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి చెందిన 181 క్లస్టర్లను గుర్తించామని, 573 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. 66 శాతం కేసులు కేవలం నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని, అవి కూడా పట్టణాల్లోనే ఉన్నాయన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో 14 కేసులు మినహా.. ఇతరత్రా నమోదవుతున్న కేసులన్నీ రెడ్జోన్లలోనే ఉన్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. టెస్ట్‌లు చేయడంలో రాష్ట్రం.. దేశంలోనే మొదటి స్థానంలోకి వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► రాష్ట్ర వ్యాప్తంగా 181 క్లస్టర్లు ఉన్నాయి. ఇందులో 121 పట్టణ ప్రాంతాల్లో, 60 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 573 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. 56 మండలాలు రెడ్‌జోన్‌లో, 47 ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. జిల్లాల వారీగా అయితే 590 కేసులు ఈ నాలుగు జిల్లాల్లోనే నమోదయ్యాయి. ► ‘గ్రీన్ జోన్లను కాపాడండి.. రెడ్జోన్లను నియంత్రించండి’ అనే నినాదంతో ముందుకెళుతున్నాం. దేశంలో 10 లక్షల జనాభాకు సగటున 334 టెస్ట్‌లు చేస్తుంటే మన రాష్ట్రంలో 961 టెస్టులు చేస్తున్నాం. ► ప్రభుత్వ నిర్ణయం మేరకు త్వరలో ఒక్కొక్కరికి 3 మాస్స్‌లు ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 16 వేల పడకలకు 2.21 లక్షల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాం. వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ చికిత్సే మంచిదని ఐసీఎంఆర్ చెబుతోంది. ర్యాపిడ్ టెస్ట్‌లు చేసుకోవచ్చని ఐసీఎంఆర్ ఆదేశాలు ► ర్యాపిడ్ టెస్ట్‌లు చేసుకోవచ్చని ఐసీఎంఆర్ ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ మొదలుపెట్టాం. ఫిబ్రవరి 25 నాటికి రాష్ట్రంలో ఒకే ఒక్క ల్యాబొరేటరీలో 90 టెస్టుల సామర్థ్యం ఉండేది. ఇప్పుడు ల్యాబొరేటరీల సంఖ్య 9కి పెంచి రోజుకు 3,480 టెస్టులు చేసే స్థాయికి చేరుకున్నాం. ► ఎక్కడ టెస్టులు చేసినా వైరాలజీ ల్యాబొరేటరీలో చేసేదే ఫైనల్. అయితే ఎక్కువ మందికి ప్రాథమిక స్క్రీనింగ్ చేసేందుకు ర్యాపిడ్ టెస్టులు ఉపయోగపడతాయి. ఔట్ పేషెంట్ సేవలకు ఇబ్బంది లేకుండా 14410 నంబర్ ద్వారా టెలి మెడిసిన్ ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ 306 మంది డాక్టర్లు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చారు. 4 వేల మందికి పైగా ఈ పద్ధతిలో వైద్య సేవలు పొందారు. బులెటిన్లోని అంశాలే రాయండి ► రాష్ట్రంలో 3 లక్షల పీపీఈ కిట్లు, 1.40 లక్షల ఎన్–95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రతి పనీ పారదర్శకంగా చేస్తోంది. మేము విడుదల చేసే బులెటిన్లోని అంశాలే రాయండి. ఇదే అధికారికంగా భావించండి. ► ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పుడు ఇక టెస్ట్‌లు దాస్తున్నారనడంలో నిజం లేదు. గ్రీన్జోన్లో 84.7 % మండలాలు రాష్ట్రంలో 573 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. 56 రెడ్ జోన్లో, 47 ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. వాస్తవాలు మాట్లాడండి కరోనాతో మృతులకు సంబంధించి ఆడిట్ చేస్తున్నాం. క్రిటికల్ కేర్ నిపుణులను ఏర్పాటు చేశాం. టెస్టులు దాస్తే దాగేవి కావు. చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వాస్తవాలు మాట్లాడండి. వేలాది మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. మీరు వారిని ప్రోత్సహించకపోయినా ఫరవాలేదు.. దయచేసి విమర్శించకండి. – డా.కె.ఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ -
తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం
-
తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం
హైదరాబాద్: తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఈత సరదా తొమ్మిది మంది ప్రాణాలు తీసింది. మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండలం కొత్తపేటలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. మృతులు సాయికుమార్(10) శివ(10), శివకుమార్(8)గా గుర్తించారు. ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం పంగిడిలో చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దేవేందర్ నగర్ లో క్వారీ గుంతలో ఈతకు దిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం న్యామత్ ఉర్సులో విషాదం చోటు చేసుకుంది. బావిలోకి ఈతకు దిగి మీర్ షారుఖ్ అలీ మృతి చెందాడు. -
నాలుగు జిల్లాలు !
కొత్తగా తొర్రూరు రెవెన్యూ డివిజన్ ఆ డివిజన్‌లోకి కొడకండ్ల మరో మూడు మండలాల ప్రతిపాదనలుl పరిశీలనలో టేకుమట్ల, పెద్ద వంగర, కొమురవెల్లి కాజీపేట వద్ద కొత్తగా మరో బ్రిడ్జి నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన సీఎంతో జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎక్కువ మండలాలు ఉన్నందునే వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు చేయగా, మిగిలిన వరంగల్ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉందని... ఈ కారణంగానే నాలుగో జిల్లా ఏర్పాటును ప్రతిపాదించామని చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌తో జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజన, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే జిల్లాల పునర్విభజన జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ఇదే తరహాలో జరిగేలా చొరవ తీసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ‘వరంగల్ జిల్లాలో కొత్తగా భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మండలాలు యాదాద్రి, సిద్ధిపేట జిల్లాల్లో కలుస్తున్నాయి. మిగిలిన మండలాలు ఎక్కువగా ఉండడంతో వరంగల్ జిల్లాను రెండుగా చేయాలని ప్రతిపాదించాము. రెండు జిల్లాలు ఎలా ఉండాలనేదానిపై ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని వివరించారు. ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్లో కొడకండ్ల మండలాన్ని చేర్చాలని పేర్కొన్నారు. కొత్తగా టేకుమట్ల(చిట్యాల), పెద్దవంగర(కొడకండ్ల), కొమురవెల్లి(చేర్యాల) మండలాలను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధికి ప్రాధాన్యం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్‌లో ఇప్పటికే ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటైందని... గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. జాతీయ స్థాయి టెక్స్టైల్ పార్కును త్వరలోనే నిర్మించబోతున్నట్లు తెలిపారు. వరంగల్ నగరం అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించామని... స్మార్ట్ సిటీ, హృదయ్లోనూ ఎంపికైనందున వరంగల్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న కాజీపేట బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే రూపొందించాలని జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిని ఆదేశించారు. -
నాలుగు జిల్లాలు ఖాయం!
ఏర్పాట్లకు నిధులు విడుదల రూ.4 కోట్లు కేటాయించిన సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన ప్రణాళిక శాఖ జిల్లాల సంఖ్యపై పూర్తి స్థాయి స్పష్టత హన్మకొండ, కాకతీయ జిల్లాలపై ఆసక్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనలో మన జిల్లా పరిస్థితి సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. కొత్తగా ఏర్పడబోయే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్, ఫైళ్లు, కంప్యూటర్లు అమర్చుకునేందుకు ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనల మేరకు జిల్లాకు రూ.4 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఇది పరిపాలన పరమైన అంశమే అయినా... మన జిల్లాకు నాలుగు కోట్లు కేటాయించడం ఆసక్తి కలిగిస్తోంది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనల మేరకు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదాలో పేర్నొన్నట్లుగా నాలుగు జిల్లాలు ఉండవని... చివరికి మూడు జిల్లాలే ఉంటాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నిధుల కేటాయింపు ఉత్తర్వులతో నాలుగు జిల్లాలు ఉంటాయనేది స్పష్టమైంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలని ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. ఇతర జిల్లాల్లోని కొన్ని మండలాలను కలుపుతూ... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొంది. జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినప్పటి నుంచి వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్విభజిస్తారని తెలిసింది. అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన ముసాయిదా అందరినీ ఆశ్చర్యపరిచింది. వరంగల్ జిల్లాను... నాలుగు జిల్లాలుగా పునర్విభజించేలా ముసాయిదాలో పేర్కొంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలకు కేటాయించవద్దని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని హన్మకొండ జిల్లాను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. హన్మకొండ స్థానంలో వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు కానుందని తాజాగా చర్చ మొదలైంది. తుది దశలో నాలుగు జిల్లాలు కాకుండా మూడే ఉంటాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం రూ.నాలుగు కోట్లు విడుదల చేయడం ఆసక్తి కలిగిస్తోంది. దీంతో నాలుగు జిల్లాలు ఉండడం ఖాయమని స్పష్టత వచ్చింది. అయితే నాలుగో జిల్లా హన్మకొండ పేరుతో ఉంటుందా.. వరంగల్ రూరల్‌గా ఉంటుందా అనేది మరో రెండు వారాల్లో తేలనుంది. -
ఓరుగల్లు.. నాలుగు
వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు యాదాద్రిలోకి దేవరుప్పుల మండలం మూడు జిల్లాల్లో జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలు రెండు జిల్లాలో భూపాలపల్లి, ములుగు, వర్ధన్నపేట వరంగల్ రెవెన్యూ డివిజన్‌లోకి పరకాల కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు పునర్విభజన ముసాయిదా విడుదల నేడు గెజిట్ జారీ చేయనున్న కలెక్టర్ ! ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ షురూ నెలరోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లా... ఇక నాలుగు భాగాలు కానుంది. జంట నగరాలైన వరంగల్, హన్మకొండలు వేర్వేరుగా జిల్లాలుగా ఏర్పడనున్నాయి. దశాబ్దాలపాటు వరంగల్ జిల్లాలకు ప్రత్యేకతను సమకూర్చిన అటవీ ప్రాంతం జయశంకర్(భూపాలపల్లి) జిల్లా కానుంది. గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాగా రూపుదిద్దుకోనుంది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జల్లాల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ప్రస్తుత ప్రతిపాదనలే కొనసాగితే సరిగ్గా 50 రోజుల తర్వాత వరంగల్ జిల్లా... నాలుగు జిల్లాలుగా మారనుంది. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉత్కంఠ వీడింది. అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు(363) జారీ చేసింది. ముసాయిదాపై 30 రోజులపాటు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. జిల్లా స్థాయిలో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రత్యేంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కరుణ... జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం వరంగల్ జిల్లా... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా మారనుంది. పునర్విభజన ముసాయిదా ప్రకారం వరంగల్ జిల్లాలో 17, హన్మకొండ జిల్లాలో 18, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15, మానుకోట జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. కొత్తగా హన్మకొండ, హుజూరాబాద్, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. ఖిలావరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్), వేలేరు(ధర్మసాగర్), ఇల్లందకుంట(జమ్మికుంట) మండలాలు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. ముసాయిదాపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ మొదలైంది. హన్మకొండ జిల్లా ఏర్పాటు అవసరం లేదని కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ కమిటీ అభ్యంతరం తెలుపుతూ జిల్లా కలెక్టర్ కరుణకు లేఖ ఇచ్చింది. జనగామౖపై అయోమయం... జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నెలలుగా ఉద్యమం చేస్తున్న జనగామపై ముసాయిదా నోటిఫికేషన్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుత వరంగల్ జిల్లాలో 51 మండలాలు ఉన్నాయి. ముసాయిదాలో 50 మండలాల పేర్లను తెలుపుతూ... ఏ మండలం ఏ జిల్లాలో కలిసేది పేర్కొన్నారు. జనగామ మండలం పేరు నోటిఫికేషన్లో పేర్కొనలేదు. జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం కొనసాగించిన జనగామ విషయంలో ఇలా జరగడంపై జనగామ జిల్లా సాధన జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముసాయిదా నోటిఫికేషన్లో మరో తప్పుదొర్లింది. దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొన్నారు. దీంతో న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఉన్నతాధికారులు గుర్తించారు. రాష్ట్ర స్థాయిలో మళ్లీ దీనిపై సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ముసాయిదా ప్రకారం జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో.... ములుగు, భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉండనున్నాయి. ముసాయిదా ప్రకారం జిల్లాలు ఇలా... వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుగొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ. హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది). జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్. మహబూబాబాద్ : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం. యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల లింగాలఘనపురం, సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు... వరంగల్ : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం, శాయంపేట, పరకాల. నర్సంపేట : నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ. హన్మకొండ : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, చిల్పూరు(కొత్తది), వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల. హుజూరాబాద్ : హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, జమ్మికుంట, ఇల్లందకుంట(కొత్తది). భూపాలపల్లి : భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, ములుగు : ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట. మహబూబాబాద్ : మహబూబాబాద్, కురవి, కేసముద్రం, డోర్నకల్, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, గూడురు, కొత్తగూడ, బయ్యారం, గార్ల. జనగామ : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట, ఆలేరు, గుండాల, రాజాపేట, గజ్వేల్ : చేర్యాల, మద్దూరు. -
నాలుగు జిల్లాలుగా వరంగల్
12 మండలాలతో హన్మకొండ జిల్లా చారిత్రక నగరం రెండుగా విభజన అన్ని వర్గాల్లో అయోమయం డ్రాఫ్టు నోటిఫికేషన్‌పై ఉత్కంఠ సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై స్పష్టత వచ్చినట్లే వచ్చి మరింత గందరగోళంలో పడింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కొన్ని నెలలుగా వస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోగా.. ఎవరూ డిమాండ్ చేయకుండానే హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ముసాయిదా నోటిఫికేషన్ రూపకల్పన దాదాపు పూర్తయింది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ముసాయిదా రూపొందించారు. జనాభా ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జనాభాను ఆధారంగా చేసుకుని కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రూపొందించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వరంగల్ జిల్లాలో 16 మండలాలు, హన్మకొండ జిల్లాలో 12 మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 16 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 12 మండలాలు ఉంటున్నాయి. మూడు నుంచి నాలుగుకు ప్రభుత్వం జూన్ మొదటి వారంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియను మొదలుపెట్టింది. వరంగల్ జిల్లాలను వరంగల్, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా విభజిస్తున్నట్లు అప్పుడు ప్రతిపాదనలు రూపొందించింది. వరంగల్ జిల్లాలో 28 మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 13 మండలాలు ఉండేలా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లా చేయాలని కొనసాగుతున్న డిమాండ్‌ను పట్టించుకోలేదనే అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో నెలకొంది. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... అన్ని జిల్లాల ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. జనగామ జిల్లా చేయాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి.రాజయ్య మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. ముసాయిదా ప్రకటనలో జనగామ జిల్లా అంశం ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశించారు. ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నది. బుధవారం ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం... మన జిల్లాను నాలుగు జిల్లాలు విభజించేలా ప్రతిపాదనలను రూపొందించింది. జనగామ జిల్లా అంశాన్ని ప్రతిపాదనల్లో పేర్కొనలేదు. వరంగల్ జిల్లాలో కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తయారు చేసింది. మొదట రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం... వరంగల్ జిల్లాలో 28 మండలాలు ఉండాలని పేర్కొంది. తాజాగా నాలుగు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదన నేపథ్యంలో వరంగల్‌కు 16 మండలాలను, హన్మకొండకు 12 మండలాలను కేటాయిస్తూ జాబితా రూపొందించింది. ఏ ఒక్కరూ కోరని, ఎవరూ అడగని హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రస్తావన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం హన్మకొండ జిల్లా ప్రతిపాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యోగ వర్గాలు, ప్రజల్లోనూ ఈ విషయంపై గందరగోళం నెలకొంది. తుది జాబితాలో హన్మకొండ జిల్లాకు చోటు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జనగామలో మార్పు లేదు... జనగామ జిల్లా ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని తాజా ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. జనగామ నియోజకవర్గంలోని ఐదు మండలాల విషయంలోనూ కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదు. మొదటి ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లుగానే ఈ సెగ్మెంట్లోని ఐదు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో కలుపుతున్నారు. జనగామ, బచ్చన్నపేట మండలాలను యాదాద్రి(భువనగిరి) జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. దేవరుప్పులు, లింగాలగణపురం మండలాలను సైతం యాదాద్రి జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రెండుమూడు రోజుల్లో వెల్లడించే ముసాయిదా నోటిఫికేషన్‌తో ప్రస్తుత గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది. జిల్లాల వారీగా మండలాలు ఇలా... వరంగల్ జిల్లా : వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, పాలకుర్తి, రాయపర్తి, శాయంపేట. హన్మకొండ జిల్లా : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హూజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్. ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కొత్తగూడ, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం. మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, కొడకండ్ల, గార్ల, బయ్యారం. యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. ప్రతిపాదిత జిల్లాల వారీగా గణాంకాలు... జిల్లా పేరు మండలాలు జనాభా విస్తీర్ణం(చదరపు కిలో మీటర్లు) వరంగల్ 16 11,26,096 2638.50 హన్మకొండ 12 11,52,579 2481.06 ఆచార్య జయశంకర్ 16 6,95,145 6032.65 మహబూబాబాద్ 12 7,54,845 3463.89 -
రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి
– సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్ ఒంగోలు: సెంట్రల్ జోన్ పరిధిలో నాలుగు జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు సత్తా చాటాల్సిన అవసరం ఉందని సెంట్రల్ జోన్ క్రికెట్ కార్యదర్శి కోకా రమేష్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆవరణలో నిర్వహించిన సెంట్రల్‌జోన్ అంతర్ జిల్లాల పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పోటీల్లో బాగా ప్రతిభ కనబరిచిన వారినే సెంట్రల్ జోన్ జట్టుగా ఎంపిక చేశామన్నారు. అయితే ఈ పోటీల్లో పదేళ్లలోపు పిల్లలైన హాసిని, చైత్రిని, వర్షిత, హాసినిలు కూడా బాగా రాణించారన్నారు. ఎంపిక కాని వారు డీలా పడాల్సిన అవసరం లేదన్నారు. తప్పకుండా మిగిలిన ఏజ్ గ్రూపుల్లో తప్పకుండా రాణిస్తారన్నారు. పీడీసీఏ జిల్లా కార్యదర్శి చింతపల్లి ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా నుంచి సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికైన తాళ్లూరి మల్లిక, పీవీ సుధారాణిలను అభినందించారు. -
హుదూద్ తుపాన్ బీభత్సం
-
అంచనాలకు మించి ఆస్తినష్టం
విశాఖ: హుదూద్ పెను తుపాను ప్రభావంతో జిల్లాలో అపార ఆస్తి నష్టం వాటిల్లింది. శిథిలాలు ఊడిపడటంతో సమాచార వ్యవస్థ ధ్వంసమైంది. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రెండు విడతలుగా పెనుగాలులు తీవ్రంగా వీయడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. పునరావాస కేంద్రాల్లో కూడా పరిస్థితి భయానకంగా మారడంతో ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. విశాఖ కలెక్టరేట్ కూడా పూర్తిగా ధ్వంసమవడంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రోజు తుపాను ప్రభావిత ప్రాంతాలను మంత్రి పి.నారాయణ పరిశీలించారు. 1996 తరువాత విశాఖలో మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చిందని నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం విశాఖలో ఏ రోడ్డు కూడా క్లియర్ గా లేదన్నారు. రోడ్లను క్లియర్ చేసేందుకు 200 పొక్లెయిన్ లను వినియోగిస్తామన్నారు. ఆస్తినష్టం అంచనాకు మించి ఉందని మంత్రి తెలిపారు. ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని, ఆస్తి నష్టంను తీవ్రతను తగ్గించలేకపోయామన్నారు. సోమవారం ఉదయం 10 గం.ల తర్వాతే సహాయకచర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. తన కారు అద్దాలు కూడా పగిలిపోయాయని మంత్రి తుపాను పరిస్థితిని విశ్లేషించారు. -
''అంచనాలకు మించి ఆస్తినష్టం''
-
తుపాను బీభత్సానికి కోస్తా జిల్లాలు అతలాకుతలం
-
తుపానుతో కోస్తా జిల్లాలు అతలాకుతలం
హైదరాబాద్: హుదూద్ తుపాన్‌తో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా చిగురుటాకులా వణుకుతున్నాయి. ఆయా జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఈదురుగాలులు మరింత బలంగా వీస్తున్నాయి. తుపాన్ ప్రభావంతో గంటకు 80 - 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆముదాలవలస మండలం వంజంగిలో ఆటోపై చెట్టు కూలింది. దీంతో ఆటో ధ్వంసమైంది. జిల్లాలోని పలాస, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో హుదూద్ ప్రభావం పాక్షికంగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 80 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కళింగపట్నం రహదారిపై భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో వేలాది ఎకరాల్లో జొన్న, అరటి, వరి, పత్తి పంటలకు నష్టం ఏర్పడింది. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి.... దీంతో జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలకు ఆహార పదార్థాలు అందించేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంతబొమ్మాళిలో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. ఆరు నేవి బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విజయనగరం జిల్లా: జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో గత అర్థరాత్రి నుంచి ఎడతేరపిలేకుండా భారీగా వర్షం కురుస్తోంది. అదే మండలంలోని తిప్పలవలస వద్ద సముద్ర తీరంలో ఉంచిన 10 బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. భోగాపురం మండలం ముక్కాం, చేపల కంచేరిలో భారీగా చెట్లు నేలకొరిగాయి. అలల ఉధృతికి ముక్కాం గ్రామంలోని ఇళ్లలోకి సముద్రం నీరు వచ్చి చేరింది. పార్వతీపురంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుంది. జిల్లావ్యాప్తంగా 60 నుంచి 70 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీర ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. విశాఖపట్నం జిల్లా: జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో పెనుగాలులు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. అలాగే విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నెలమట్టమైయాయి. జిల్లాలోని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆనందపురం, పద్మనాభ మండలాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోంగా ఉంది. అలలు 2 మీటర్ల ఎత్తు మేర ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తీరప్రాంతంలో 15 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. తాటిచెట్లపాలెం, కంచరపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, ఎయిర్పోర్ట్ రహదారుల్లో చెట్లు కూలిపోయాయి. దీంతో రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. భీమిలి మండలం బోయవీధిలో సముద్రపు నీరు ఇళ్లలోకి చేరింది. జిల్లాలో జాతీయ రహదారిపై 60 కిలో మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. భీమిలి, కాపులుప్పాడ వద్ద సముద్ర తీరంలో అలలు భారీగా ఎగసిపడుతూ ముందుకు దూసుకు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా: జిల్లాలో పలు చోట్ల గత రాత్రి నుంచి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తోంది. తుని,తొండంగి మండలాల్లో ఈదురుగాలులు, భారీ వర్షం పడుతోంది. తొండంగి మండలంలోని తీరప్రాంతాలలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఆయా మండలాలోని తీరప్రాంత గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గొల్లప్రోలులో ఈదురుగాలలో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు విరిగిపోయియి. ఉప్పాడ తీరంపై సముద్రపు అలలు విరుచుకుపడుతున్నాయి. మాయాపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చింది. అలాగే కోనాపాపపేటలో తీర ప్రాంతం కోతకు గురైంది. స్థానికంగా నివసిస్తున్న 20 మత్స్యకారుల ఇళ్లు నేలమట్టమైనాయి. -
'ఆ నాలుగు జిల్లాలకే నష్టం ఎక్కువ'
విశాఖపట్నం: హుదుద్ తుపాన్ రేపు ఉదయం విశాఖపట్నంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెనుగాలులు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపింది. విద్యుత్, రవాణా వ్యవస్థలు దెబ్బతింటాయని పేర్కొంది. శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తీరం దాటిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో నష్టం ఎక్కువ ఉంటుందని తెలిపింది.