సాక్షి, వనపర్తి: మానవత్వం మరిస్తే బతుకుకర్థమే లేదు. తోటి మనిషికి సాయపడితే కలిగే సంతోషాన్ని మించిన సంపదా లేదు. ఒక మంచిపనితో ఎందరి మనసుల్లోనో చోటును ఆస్తిగా సంపాదించుకున్నాడీ వ్యక్తి. వనపర్తి మండలం చందాపూర్‌లో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్లు ఇస్తున్నారని చెప్పడంతో ఓ దివ్యాంగుడు హడావుడిగా వెళ్తూ దారిలో పడిపోయాడు.
ఆ చోటునుంచి కదలలేకపోయాడు. అటుగా వెళ్తున్న మరో పింఛన్‌దారుడు గమనించి సదరు దివ్యాంగుడిని కార్యాలయం వరకు ఎత్తుకొని వెళ్లి మానవత్వాన్ని చాటాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చదవండి: ‘మిల్లెటు’ బండెక్కి వచ్చేత్తమూ..
Comments
Please login to add a commentAdd a comment