![Maoists killed In Kothagudem - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/23/3655.jpg.webp?itok=PTwcb3DV)
సాక్షి, కొత్తగూడెం: చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాగా కాల్పుల అనంతరం ప్రదేశాన్ని తనిఖీలు నిర్వహించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే కాల్పులు జరిగిన ప్రదేశం నుండి ఒక 8ఎమ్‌ఎమ్ రైఫిల్, బ్లాస్టింగ్‌నకు ఉపయోగించే సామగ్రి, 01 కిట్ బ్యాగు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment