
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ అగ్ని ప‍్రమాద ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గంలోని గ్రీన్‌బవార్చి హోటల్‌లో ఐమాక్ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటల కారణంగా బిల్డింగ్‌లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
కాగా, భవనం లోపల 20 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. బాధతులు తమను రక్షించాలంటూ భవనం పై నుంచి కేకలు వేస్తున్నారు. ప‍్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భారీ క్రేన్‌లో సాయంతో రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొదటి అంతస్తులో గ్రీన్ బావర్చి, 2,3 అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు ఉన్న అంతస్తులో పొగ అలుముకుంది. కాగా, హోటల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భవనం పైన ఉన్న 14 మందిని కాపాడారు. భవనం లోపల ఇంకా కొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment