
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో, అపార్ట్‌మెంట్‌వాసులు బయటకు పరుగులు తీశారు.
వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి మంటలు వ్యాపించాయి. దీంతో, భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు పక్కనే ఉన్న మరో ఇంటికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గ్యాస్ లీక్ కావడమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం కారణంగాలో అపార్ట్‌మెంట్‌లో పలువురి విలువైన వస్తువులు, దుస్తులు కాలిపోయాయి. దాదాపు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment