
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మండలం తహసీల్దార్‌గా ఇంచార్జ్ తహసీల్దార్ గీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కీసర తహసీల్దార్‌గా ఉన్న నాగరాజు భూవివాదం కేసులో లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి చిక్కారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం ఇంచార్జ్ తహసీల్దార్‌గా ఉన్న గీత గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆమె తహసీల్దార్‌గా బాధ్యతలు చేపడుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
చదవండి: కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!
చదవండి: కదులుతున్న ‘పాముల పుట్ట’