Bribing case
-
కీసర నూతన తహసీల్దార్‌గా గీత!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మండలం తహసీల్దార్‌గా ఇంచార్జ్ తహసీల్దార్ గీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కీసర తహసీల్దార్‌గా ఉన్న నాగరాజు భూవివాదం కేసులో లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. కోటి పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి చిక్కారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం ఇంచార్జ్ తహసీల్దార్‌గా ఉన్న గీత గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆమె తహసీల్దార్‌గా బాధ్యతలు చేపడుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. చదవండి: కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం! చదవండి: కదులుతున్న ‘పాముల పుట్ట’ -
కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!
సాక్షి, మేడ్చల్: అవినీతి తిమింగలం కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రియల్టర్ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్‌రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు సమాచారం. ఏసీబీకి చిక్కిన రియల్టర్ బ్రోకర్ అంజిరెడ్డి, రేవంత్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది. రేవంత్ వద్ద ఉండాల్సిన కీలక పత్రాలు రియల్టర్ వద్ద ఉండటంపై విచారణ చేస్తున్నామని ఏసీబీ తెలిపారు. కలెక్టర్ ఆఫీసులో ఉండాల్సిన పలు పత్రాలు కూడా అంజిరెడ్డి వద్ద లభ్యమమైనట్టు తెలిసింది. (చదవండి: కదులుతున్న ‘పాముల పుట్ట’) కేసు వివరాలు.. కీసర మండలం రాంపల్లి దాయరలో పట్టాదారు, కౌలుదారుల మధ్య భూ వివాదం నడుస్తోంది. 19 ఎకరాలకు సంబంధించిన వివాదంలో 8 ఎకరాలకు సంబంధించి పట్టాదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అందుకు అనుగుణంగా ఆ భూమిని వారి పేరు మీదకు మార్చాల్సి ఉంది. మరో 11 ఎకరాల వివాదం ఆర్డీఓ పరిధిలో ఉంది. 8 ఎకరాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తహసీల్దార్‌ను సంప్రదించి ఈ భూమిని పట్టాదారుల పేర చేయాలని కోరారు. దీనికి తహసీల్దార్ రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన, మేడ్చల్ కలెక్టర్ ద్వారా వెలువడాల్సిన డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్ ఫైల్‌ను తన కార్యాలయంలోనే తయారుచేసి, వాటిని తీసుకొని తహసీల్దార్ నాగరాజు రియల్టర్ కందాడి అంజిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. అప్పటికే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ అక్కడ డబ్బులతో ఉన్నారు. దీనిపై ఉప్పందుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. (అవినీతికి పడగలెత్తిన నాగరాజు) -
రవాణా కమిషనర్ కార్యాలయంలో దాడులు
సాక్షి, హైదరాబాద్: స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొలువుదీరి ఉండే రవాణా కమిషనర్ కార్యాలయంలోనే లంచావతారం పడగవిప్పింది. కొత్త వాహనాల్లో మార్పుచేర్పులు, అక్షర దోషాలను సవరించడం వంటి విధులు నిర్వహించే పరిపాలనాధికారి జె.నరేందర్ మంగళవారం రూ.36 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా అవినీ తికి పాల్పడుతూ నరేందర్ ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన సీహెచ్ సందీప్ ట్రేలర్ అండ్ ట్యాంకర్‌గా వాహనాన్ని మార్పు చేసుకోవడం కోసం రవాణాశాఖ నుంచి ప్రొసీడింగ్స్‌ను పొందేందుకు గత నెల 13న అడ్మినిస్ట్రేటివ్ అధికారి నరేందర్‌ను సంప్రదించాడు. సదరు అనుమతుల కోసం రూ.36 వేలు లంచం ఇవ్వాల్సిందిగా నరేందర్ డిమాండ్ చేశాడు. చివరకు రూ.30 వేలు తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో సందీప్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు రూ.36 వేల నగదును నరేందర్‌కు అందజేశాడు. అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు నరేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2016 జనవరి 4న ఒక కేసులో రూ.8,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్ తిరిగి మరోసారి పట్టుబడటం గమనార్హం. అతన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. రవాణా శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్–1064కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ దాడులతో హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. దళారులను కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించారు. -
ఏసీబీ వలలో జెడ్పీ సీఈఓ
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :ఎవరో చిన్న పరిగెల వంటి చిరుద్యోగులను మాత్రమే ఇటీవల పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు జిల్లాస్థాయి అధికారి చిక్కారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) కోరా జయరాజ్ సోమవారం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా స్థాయి ఉన్న తాధికారుల్లో ఒకరైన జెడ్పీ సీఈఓ ఇలా అవినీతికి పాల్పడుతూ పట్టుబడడం సంచలనం కలిగించింది. అధికార యంత్రాంగంలో వణుకు పుట్టించింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ప్రాజెకు ్టవర్క్స్ (సీపీడబ్ల్యూ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓవర్‌హెడ్ ట్యాంకుల మరమ్మతు, నిర్వహణ కాంట్రాక్టును ముమ్మిడివరానికి చెందిన ఎం.ధర్మారావుకు అప్పగించారు. కొమరాడ, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, తొత్తరమూడిలలో రూ.6.75 లక్షల విలువైన పనులు పూర్తి చేసిన ధర్మారావు ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధిత పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా ఏప్రిల్‌లోనే జెడ్పీకి సమర్పించారు. అప్పటి నుంచి ఈ బిల్లు మంజూరు కోసం సీఈఓ జయరాజ్ ఏదో ఒక అభ్యంతరం ఎత్తిచూపుతూ తిప్పించుకుంటున్నారు. ఈలోగా సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో బిల్లులు పూర్తిగా పెండింగ్‌లో పడిపోయాయి. కాగా ఈ నెల ఒకటిన ధర్మారావు మరోసారి జెడ్పీ సీఈఓను కలిసి బిల్లులు మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించారు. తనకు రూ.60 వేలు ఇస్తే బిల్లులు మంజూరు చేస్తానని సీఈఓ చెప్పారు. ఇప్పటికే అప్పులపాలైన తాను అంత ఇచ్చుకోలేనని, బిల్లులు మంజూరు చేయాలని ధర్మారావు విజ్ఞప్తి చేశారు. అయిన ప్పటికీ సీఈఓ ససేమిరా అనడంతో చివరకు రూ.40 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతరం సీఈఓపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలింపు ఏసీబీ అధికారుల సూచన మేరకు ధర్మారావు సోమవారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓకు రూ.30 వేలు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సొమ్మును సీసీకి ఇమ్మని సీఈఓ సూచించగా, స్వామిమాలలో ఉన్న సీసీకి లంచం సొమ్ము ఇవ్వలేనని ధర్మారావు చెప్పారు. దీంతో సీఈఓ ఆయనను తన చాంబర్‌కు పిలిపించుకొని సొమ్మును టేబుల్ మీద ఉన్న పుస్తకాల్లో ఉంచమన్నారు. ధర్మారావు 30 వెయ్యి రూపాయల నోట్లను పుస్తకాల మధ్య ఉంచారు. అదే సమయంలో ఏసీబీ జిల్లా డీఎస్పీ ఎన్.వెంకటేశ్వరరావు, ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు రాజశేఖర్, సంజీవ్‌రావు, సిబ్బంది చాంబర్లోకి చొరబడి లంచం సొమ్ముతో సీఈఓ జయరాజ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఇంద్రపాలెంలోని ఆయన ఇంటితో పాటు జన్మభూమి పార్కు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ సోదాలు సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సీఈఓ జయరాజ్‌ను అదుపులోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. సీఈఓ జయరాజ్ రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇదే జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదా వరకు పనిచేశారు. ఇతర జిల్లాల్లో పనిచేసి ఈ ఏడాది మార్చిలో జెడ్పీ సీఈఓగా బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన ఏసీబీ దాడిలో పట్టుబడడంతో జిల్లా అధికారుల్లో కలకలం రేగింది.