![Minister Srinivas Goud Appericiate Telangana CM KCR - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/15/SRINIVAS-GOUD.jpg.webp?itok=TrQ4MAhC)
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతు బంధు, దళిత బంధు, 24 గంటల కరెంట్ వంటి పథకాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌తోనే దేశ రాజకీయాల్లో మార్పు సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని పలు రాష్ట్రాల నేతలు, సంఘాలు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.
సీఎంకు ఇప్పటికే 17 రాష్ట్రాల సంఘాలు మద్దతు తెలిపాయని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ రాష్ట్రంలో కొనసాగుతూ దేశంలో ఉన్న సంఘాలు, నేతలను కలుపుకొని కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా మద్దతు ఇచ్చేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment