
సాక్షి, హైదరాబాద్: క్రీమీలేయర్ విధానంతో వేలాదిమంది ఓబీసీ విద్యార్థులకు యూపీఎస్సీలో తీవ్ర నష్టం జరుగుతుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జరుగుతున్న నష్టం గురించి తనను శుక్రవారం కలిసిన బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుకు మంత్రి వివరించారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉండి రూ. 8 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వారి కుటుంబాలకు క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేయాలనే నిబంధలున్నా.. ఎక్కడా అమలు కావడం లేదన్నారు.
దీనిపై రాష్ట్ర బీసీ కమిషన్ సమగ్రమైన నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కృష్ణమోహన్‌కు మంత్రి సూచించారు. ఈ భేటీలో మహబూబ్‌నగర్ జిల్లా బీసీ సంఘాల ప్రతినిధులు గిరిగౌడ్, తిరుపతి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment