హైదరాబాద్,సాక్షి: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయ శ్రేణులు స్పందిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఈ తీర్పుపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరో బెంచ్‌ను ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు: మాజీ మంత్రి హరీష్ రావు
- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.
- ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు.
- హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం.
- తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా ఉంది.
- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యం.
కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: కేటీఆర్
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది
- నాలుగు వారాల తర్వాత దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం
- పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నాం
- పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
- రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
- న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదన్న కేటీఆర్
హైకోర్టు తీర్పు హర్షనీయం: బీఆర్‌ఎస్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు
- బీఆర్‌ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌కి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఇది.
- నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం హర్ష నీయం.
- స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపొతే సుమోటోగా కేసు విచారిస్తామని హైకోర్టు చెప్పింది.
- స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు ఇచ్చిన అనేక తీర్పులున్నాయి.
- నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపొతే కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తాం.
- ఈ వ్యవహారంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తాం.
- ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుంది.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, కానీ: కడియం
- రాజకీయ నేతగా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా
- తీర్పును సమగ్రంగా పరిశీంచాల్సి ఉంది
- ఫిరాయింపులపై కామెంట్ చేసే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు
- సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డబుల్ బెంచ్ వెళ్లొచ్చు
- అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లొచ్చు
ప్రజాకోర్టులో కూడా ద్రోహులకు దెబ్బ తప్పదు: జగదీష్ రెడ్డి
- నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకులు
- కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంప పెట్టులా హైకోర్టు తీర్పు వచ్చింది: జగదీశ్ రెడ్డి
- ప్రజాకోర్టు లోకూడా ద్రోహులకు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు: జగదీశ్ రెడ్డి
- పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడటం ఖాయం. ఉప ఎన్నికలు రావడం ఖాయంv
- హైడ్రా పేరుతో రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతిస్తున్నడు: జగదీశ్ రెడ్డి
- హైదరాబాద్ అంటేనే భయపడేలా చేసిండు: జగదీశ్ రెడ్డి
- అడ్డగోలుగా బుల్డోజర్లలతో రాజకీయాలు చేస్తుండు
- రాజకీయ కక్ష సాధింపు చేస్తూ హైడ్రామా అడుతున్నాడు
- రేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి
కోర్టు నిర్ణయాన్ని స్పీకర్ గౌరవించాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
- నేను ,ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటిషన్ పై హై కోర్టు తీర్పు ఇచ్చింది ..
- పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని హై కోర్టు స్పీకర్ కు సూచించింది
- స్పీకర్ హై కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి
- కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల పై రాష్టానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది
- హిమాచల్ లో బీజేపీ కి మద్దతు పలికిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేశారు
- కర్ణాటక లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు
- కాంగ్రెస్ జాతీయ పార్టీ లా వ్యవహరించడం లేదు
- ఉప ప్రాంతీయ పార్టీ లా వ్యవహరిస్తోంది
- రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ఫిరాయింపుల పై ఎందుకు స్పందించడం లేదు
- రేవంత్ రెడ్డి కి కారెక్టర్ లేదు
- రాహుల్ గాంధీ అయినా తాను ఫిరాయింపుల పై చెప్పిన మాటలను గౌరవించాలి
- కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు
- ఇపుడు హైకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ గౌరవించాలి
- బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పిరాయించిన పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం
- దానం నాగేందర్ ను హైదరాబాద్ రోడ్ల పై మేమే ఉరికిస్తాం
- రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ము తో పది మంది బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు తలా పది కోట్లు ఇచ్చి కొన్నారు
- అన్ని వ్యవస్థలు పరస్పరం సహరించుకుని పని చేయాలి
- హై కోర్టు చెప్పింది శాసన సభాపతి పాటించాలి
స్పీకర్‌పై సీఎం ఒత్తిడి చేయొద్దు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
- హై కోర్టు తీర్పు బీ ఆర్ ఎస్ సాధించిన తొలి విజయం
- మళ్ళీ కోర్టు జోక్యం చేసుకోకముందే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలి
- స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి
- సీఎం ఆయన పై ఏ ఒత్తిడి తేవొద్దు
- కాంగ్రెస్ పిరాయింపుల పై ద్వంద్వ ప్రమాణాలు వీడాలి
- స్పీకర్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి
- కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
- హై కోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది
- అన్ని అసెంబ్లీ లకు ఈ తీర్పు ప్రామాణికం కానుంది
- సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment