Defection MLAs
-
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై.. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి.. పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. కిందటి ఏడాది.. నాలుగు నెలల్లోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు జారీ చేయించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. మరోవైపు.. ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.ధృవీకరించిన ఎమ్మెల్యేలుతమకు అసెంబ్లీ సెక్రెటరీ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావులు అన్నారు. ‘‘అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ నుండి నోటీసులు ఇచ్చింది వాస్తవమే. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతాం’’ అని మీడియాకు తెలిపారు.స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. భేటీలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ నోటీసుల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు’
హైదరాబాద్,సాక్షి: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయ శ్రేణులు స్పందిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఈ తీర్పుపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరో బెంచ్‌ను ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు: మాజీ మంత్రి హరీష్ రావుఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు.హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం.తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా ఉంది.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యం.కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: కేటీఆర్పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చిందినాలుగు వారాల తర్వాత దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయంపార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నాంపార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందిరాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారున్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదన్న కేటీఆర్హైకోర్టు తీర్పు హర్షనీయం: బీఆర్ఎస్ న్యాయవాది గండ్ర మోహన్రావుబీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌కి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఇది.నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం హర్ష నీయం.స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపొతే సుమోటోగా కేసు విచారిస్తామని హైకోర్టు చెప్పింది.స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు ఇచ్చిన అనేక తీర్పులున్నాయి.నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపొతే కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తాం.ఈ వ్యవహారంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తాం.ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుంది. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, కానీ: కడియంరాజకీయ నేతగా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా తీర్పును సమగ్రంగా పరిశీంచాల్సి ఉంది ఫిరాయింపులపై కామెంట్ చేసే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదుసింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డబుల్ బెంచ్ వెళ్లొచ్చుఅవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లొచ్చుప్రజాకోర్టులో కూడా ద్రోహులకు దెబ్బ తప్పదు: జగదీష్ రెడ్డినల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకులుకాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిబీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంప పెట్టులా హైకోర్టు తీర్పు వచ్చింది: జగదీశ్ రెడ్డిప్రజాకోర్టు లోకూడా ద్రోహులకు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు: జగదీశ్ రెడ్డిపార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడటం ఖాయం. ఉప ఎన్నికలు రావడం ఖాయంvహైడ్రా పేరుతో రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతిస్తున్నడు: జగదీశ్ రెడ్డిహైదరాబాద్ అంటేనే భయపడేలా చేసిండు: జగదీశ్ రెడ్డిఅడ్డగోలుగా బుల్డోజర్లలతో రాజకీయాలు చేస్తుండురాజకీయ కక్ష సాధింపు చేస్తూ హైడ్రామా అడుతున్నాడురేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయికోర్టు నిర్ణయాన్ని స్పీకర్ గౌరవించాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డినేను ,ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటిషన్ పై హై కోర్టు తీర్పు ఇచ్చింది ..పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని హై కోర్టు స్పీకర్ కు సూచించిందిస్పీకర్ హై కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలికాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల పై రాష్టానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోందిహిమాచల్ లో బీజేపీ కి మద్దతు పలికిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేశారుకర్ణాటక లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారుకాంగ్రెస్ జాతీయ పార్టీ లా వ్యవహరించడం లేదుఉప ప్రాంతీయ పార్టీ లా వ్యవహరిస్తోందిరాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ఫిరాయింపుల పై ఎందుకు స్పందించడం లేదురేవంత్ రెడ్డి కి కారెక్టర్ లేదురాహుల్ గాంధీ అయినా తాను ఫిరాయింపుల పై చెప్పిన మాటలను గౌరవించాలికాంగ్రెస్ మేనిఫెస్టో లో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారుఇపుడు హైకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ గౌరవించాలిబీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పిరాయించిన పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయందానం నాగేందర్ ను హైదరాబాద్ రోడ్ల పై మేమే ఉరికిస్తాంరేవంత్ రెడ్డి అవినీతి సొమ్ము తో పది మంది బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు తలా పది కోట్లు ఇచ్చి కొన్నారుఅన్ని వ్యవస్థలు పరస్పరం సహరించుకుని పని చేయాలిహై కోర్టు చెప్పింది శాసన సభాపతి పాటించాలిస్పీకర్పై సీఎం ఒత్తిడి చేయొద్దు: ఎమ్మెల్యే కేపీ వివేకానందహై కోర్టు తీర్పు బీ ఆర్ ఎస్ సాధించిన తొలి విజయంమళ్ళీ కోర్టు జోక్యం చేసుకోకముందే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలిస్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలిసీఎం ఆయన పై ఏ ఒత్తిడి తేవొద్దుకాంగ్రెస్ పిరాయింపుల పై ద్వంద్వ ప్రమాణాలు వీడాలిస్పీకర్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలికాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలిహై కోర్టు తీర్పు చారిత్రాత్మకమైందిఅన్ని అసెంబ్లీ లకు ఈ తీర్పు ప్రామాణికం కానుందిసీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి -
అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం.. వినూత్న నిరసన
సాక్షి, తిరుపతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్సీపీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. నలుగురు ఎమ్మెల్యేల కటౌట్లకు నల్ల జెండాలు కట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. వెంకటగిరిలోని కైవల్యా నదిలో నిమజ్జనం చేశాయి. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలకు పుట్టగతులు ఉండవని రాంప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. చదవండి: ‘నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు’ -
డీజీపీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన ఆధారాలను సీబీఐకి బదిలీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆ నలుగురు ఎమ్మెల్యేలతోపాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని కోరాం. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీని అపాయింట్ మెంట్ కోరితే తప్పించుకు తిరుగుతున్నారు. చీఫ్ సెక్రటరీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఉద్దేశపూర్వకంగా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు సీఎస్ వత్తాసు పలుకుతున్నట్లు కాంగ్రెస్ భావించాల్సి వస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల 12 నియోజకవర్గాల్లో సంక్రాంతి తరువాత కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. నాగర్ కర్నూల్లో దాడులకు నిరసనగా ఈ నెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాలపై స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తాం’’ అని ఆయన అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనపై కూడా డీజీపీకి ఫిర్యాదు చేశాం. ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై దూషణలు, దాడులకు దిగారు. గొంతుపై కాలు పెట్టి తొక్కి పరుష పదజాలంతో దూషించారు. ఇది ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్య అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చదవండి: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మల్లు రవికి నోటీసులు -
ఫిరాయింపులను ప్రోత్సహించం
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే అనుమతిస్తా మని ఉద్ఘాటించారు. తమ పార్టీ ఆది నుంచి ఇదేరకమైన ఉన్నత సంప్రదాయాన్ని పాటిస్తోందని, దీన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన్ను అభినందించారు. సభాపతి స్థానంలో తమ్మినేని సీతారాం ఆశీనులు కాగానే సభా నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి ప్రసంగం చేశారు. కొత్త స్పీకర్‌కు ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అభినందనలు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశాం.. ‘అధ్యక్షా.. ఇదే సభలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలను మార్చిన పరిస్థితిని చూశాం. వైఎస్సార్ సీపీ తరఫున 67 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఏకంగా 23 మందిని పార్టీ మార్చి ఫిరాయింపులకు ప్రోత్సహించి అందులో నలుగురిని మంత్రులను కూడా చేసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్య దేవాలయ ప్రతిష్టను ఎలా మంటగలిపారో ఇదే సభలో మనమంతా చూశాం. చివరకు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అప్పటికప్పడు నిబంధనలు మార్చేయడాన్ని కూడా ఇదే సభలో చూశాం. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి సభా మర్యాదను కాపాడాలని, అప్పుడే మేం సభకు వస్తామని చెబితే కనీసం పట్టించుకోని సభను కూడా చూశాం. అనర్హత వేటు వేయని ప్రభుత్వం మీద ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో తాజా ఎన్నికల్లో చూశాం. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేను డోర్ తెరిస్తే... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సభలో చట్టాలకు తూట్లు పొడిచి మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొన్నారో చూశాం. అటువంటి పరిస్థితులు, అటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకర్ ఉన్న చట్టసభ కాకుండా... దేవుడి దయతో మంచి స్పీకర్‌ను కూర్చోబెట్టాం. నేను కూడా చంద్రబాబు మాదిరిగా చేసి ఉంటే ఆయన ప్రతిపక్ష నేత హోదాలో కూర్చునే వారు కాదు. నేను డోర్ తెరిస్తే.. ఎంతమంది నాతో టచ్‌లో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదని, చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని, మంచి చేసే దిశగా మాట్లాడుతుంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు చాలా గొప్పగా స్క్రిప్టు రాశాడు దేవుడి స్క్రిప్టు గొప్పగా ఉంటుందనడానికి ఎన్నికలే నిదర్శనం. మా ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లెన్నో తెలుసా? అక్షరాలా 23 సీట్లు. ముగ్గురు ఎంపీలను కొన్న వారికి వచ్చిన సీట్లు మూడు. అది కూడా ఎప్పుడు వచ్చాయో తెలుసా? 23వ తేదీ. దేవుడు గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అక్కర్లేదు. బ్యూటీ ఆఫ్ డెమొక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈ చట్టసభలో మళ్లీ ఇవాళ చూస్తున్నాం. స్పీకర్, సభానేత ఎలా ఉండాలంటే.. అటు టెండర్ల వ్యవస్థలోగానీ, గ్రామస్థాయిలోగానీ, ప్రభుత్వ యంత్రాంగంలోగానీ అవినీతిని తొలగించి విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలకు ఏపీని కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు మా ప్రభుత్వం మొదటి రోజు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే స్పీకర్‌గా సీతారాంను ప్రతిపాదించాం. ఒక స్పీకర్, ఒక సభా నాయకుడు ఎలా ఉండకూడదో గత శాసనసభను చూస్తే అందరికీ అర్థమైంది. వారు ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రజాస్వామ్యం, చట్టసభలపై నమ్మకం పెరగాలి గతంలో విలువలు పతనమైన ఇదే సభలో ఉన్నత విలువలు ప్రోదిచేసి సభ ఔన్నత్యాన్ని పెంచుతారనే నమ్మకంతో ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై సౌమ్యుడిగా పేరున్న తమ్మినేని సీతారాంను సభాపతిగా ప్రతిపాదించాం. అయితే స్పీకర్‌గా ఎన్నికయ్యే వారు ఎలా ఉండాలనే మీమాంస నాలో కలిగింది. నేను కూడా అన్యాయమైన సంప్రదాయాన్నే పాటిస్తే ఇక మంచి అనేది ఎక్కడా బతకదు. అందువల్లే శాసనసభ సంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి తెలిసిన వ్యక్తి అయితే న్యాయం చేస్తారని భావించాం. ప్రజాస్వామ్యం, చట్టసభల మీద మళ్లీ నమ్మకం పెంచేందుకు, వ్యవస్థలో మార్పు తేవటానికి సీతారాం సరైన వ్యక్తి అని మనస్ఫూర్తిగా నమ్మి సభాపతిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరా. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు... బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులుగా మార్చుతామని మా పార్టీ ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎప్పుడూ జరగని విధంగా దాదాపు 60 శాతం మందికి మంత్రిమండలిలో స్థానాలు కల్పించడమే కాకుండా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా చేశాం. అందులో నలుగురిని బడుగు, బలహీన వర్గాల నుంచి ఎంపిక చేశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ తమ్మినేనిని ఎన్నుకోవడం ద్వారా అధికారంలోనూ, పరిపాలనలో, శాసనసభ¿¶లోనూ మా కట్టుబాటు, కమిట్మెంట్ను నిరూపించుకుంటున్నాం. ఈ శాసనసభ పార్లమెంటరీ సంప్రదాయాల విషయంలో దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటున్నా. విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు.. ఇక్కడ ఒక్క విషయం అందరికీ చెప్పదలిచా. నాకు కొంతమంది ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు 23 మంది శాసనసభ్యులున్నారు. వారిలో ఐదుగురిని లాగేస్తే ఆయనకు 18 మందో, 17 మందో ఉంటారు. ఫలితంగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కదు, విపక్ష ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారు. అయితే అలా చేస్తే నాకూ, ఆయనకూ తేడా లేకుండా పోతుందని చెప్పా. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్పదలిచా. ఆ పార్టీ (టీడీపీ) నుంచి మేమెవరినైనా తీసుకుంటే వారిని తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటాం. అలా కాకుండా ఏదైనా పొరపాటున జరిగితే వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా మీకే విన్నవిస్తున్నా. ఇలాంటి గొప్ప విధానాలు మళ్లీ ఈ శాసనసభకు వస్తాయని ఆశిస్తూ, మీరు ఆ పని చేయగలరని పూర్తిగా విశ్వసిస్తూ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నా’’ కళ్లెదుట జరిగిన ఘటనను వక్రీకరిస్తారా? స్పీకర్‌ను తొలిసారిగా సభాపతి స్థానంలో ఆశీనులను చేసే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందుకు రాకపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించనందువల్లే రాలేదని, పిలవని పేరంటానికి ఎలా వస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే తాను అన్ని పార్టీల నేతల్ని ఆహ్వానించినట్లు ప్రొటెం స్పీకర్ చిన అప్పలనాయుడు స్పష్టం చేశారు. ‘ప్రొటెం స్పీకర్ ఆహ్వానాన్ని మన్నించాల్సించిపోయి నాకు బొట్టు పెట్టలేదు, చీరె ఇవ్వలేదు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు’ సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ఆన్ రికార్డుగా సాక్షాత్తూ మన కళ్లెదుటే జరిగిన ఘటననే వక్రీకరిస్తున్నారు. చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి అన్యాయంగా వ్యహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సాగదీయడం ఇష్టంలేదు. దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మీ గురించి ఎన్టీఆర్ ఏమన్నారో అసెంబ్లీ టీవీల్లో చూపమంటారా? సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉందని విపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన పార్టీ మారలేదా? గెలిచిన నాలుగు రోజుల్లోనే పార్టీ మారారని అప్పట్లో బాట్టం శ్రీరామ్మూర్తి ఘాటుగా విమర్శించారు. అధికార పక్షం సాంప్రదాయాలు పాటించకపోయినా మేం పాటిస్తాం. సభాపతిగా తమ్మినేని పేరు ప్రకటించగానే ప్రొటెం స్పీకర్ మమ్మల్ని కూడా అడుగుతారని భావించా’ అని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకుంటూ ‘చంద్రబాబు గురించి సొంత కూతురిని ఇచ్చిన ఎన్టీఆర్ ఏమన్నారో అసెంబ్లీలో స్పీకర్ అనుమతితో టీవీల్లో వేసి చూపించమంటారా?’ అని సూటిగా ప్రశ్నించారు. బలహీన వర్గాల నుంచి స్పీకర్‌ను ఎంపిక చేస్తే అందులోనూ రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వివాదం రేపిన చంద్రబాబు వ్యాఖ్యలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి విపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. టీడీపీ సర్కారు సంతలో పశువులను కొన్నట్లు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మంత్రి పదవులు కూడా ఇచ్చిందని అధికార పక్ష సభ్యులు అనగా చంద్రబాబు లేచి ‘మీదీ రాజకీయ కుటుంబమే. మీ తండ్రి (వైఎస్ రాజశేఖరరెడ్డి) 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మరి ఆనాడు మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకుంటారా?’ అంటూ చంద్రబాబు సంబంధం లేని అంశాన్ని ప్రస్తావించారు. దీంతో అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలుగజేసుకుని, అప్పట్లో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టమే లేదని గుర్తుచేశారు. ‘‘గత ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వం చేయదని నేను చెబుతుంటే చంద్రబాబు ఏమేమో మాట్లాడుతున్నారు. తప్పు చేసినందుకు వారికి (టీడీపీకి) దేవుడు గొప్పగా స్క్రిప్టు రాశారు. దేవుడి జడ్జిమెంట్ చూసైనా మారాలని చెబితే కుక్కతోక ఎప్పుడూ వంకరే అనే చందంగా వ్యవçహరిస్తున్నారు’’ అని జగన్ తప్పుబట్టారు. మరోసారి చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఏదో మాట్లాడబోగా.. ‘‘బాబు మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఎందుకయ్యా హత్య చేశారని అడిగితే గతంలో 15–25 ఏళ్ల కిత్రం హత్యలు జరిగాయి కదా? అని చెప్పినట్లుంది. చంద్రబాబు గతంలో సభా నాయకునిగా ఉండి చేసిందేమిటి? 23 మంది విపక్ష సభ్యులను కొన్నారు. స్పీకర్ స్థానాన్ని నిర్వీర్యం చేశారు. ఇది తప్పు. అన్యాయం. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అన్న మాటలను మీరు (స్పీకర్) అవకాశం ఇస్తే వినిపిస్తా’’ అని జగన్ అన్నారు. స్పీకర్ స్పందిస్తూ.. సభ్యులు సంయమనం పాటించాలని కోరారు. -
జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు?
సాక్షి, బాన్సువాడ: పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ నాయకులు కోరారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు మంగళవారం స్పీకర్‌ను బాన్సువాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా తాజాగా పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని.. ఇది రాజ్యాంగ విరుద్దమని వారు స్పీకర్‌కు వివరించారు. అనంతరం స్పీకర్ నివాసంలో భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..ఇంతకు ముందు కూడా పార్టీ ఫిరాయించిన 6 గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా పార్టీ ఫిరాయించిన హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, జూలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్ క్వాలిఫై చేయాలని నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని అన్నారు. అనేక ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల బాన్సువాడకు వచ్చి కలిసినట్టు పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్లో విలీనం చేస్తామంటూ.. ఇటీవల అధికార పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యవహారం అని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడూ.. గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకు అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేసామని గుర్తుచేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. డిస్ క్వాలిఫై నోటీసు ఇస్తున్న సమయంలో స్పీకర్ ఫొటో తీసుకోవడానికి కూడా అనుమతించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. జాతీయ పార్టీలో ఓ ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్
సాక్షి, అమరావతి: చంద్రబాబు యూజ్ అండ్ త్రో విధానంతో ఈసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపీఠం ఎక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ, సర్వేల్లో వెనుకబడ్డారంటూ రకరకాల సాకులతో వారికి మొండి చేయి చూపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేనంటూ తెగేసిచెప్పేశారు. 21 మందిలో కేవలం ఐదారుగురికి మాత్రమే మళ్లీ పోటీ చేసే అవకాశమివ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. వారిలో భూమా నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు మృతి చెందగా.. మిగిలిన 21 మంది టీడీపీలో కొనసాగుతున్నారు. వారిలో నలుగురికి ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే ఇప్పుడు వారందరి పరిస్థితి తలకిందులైంది. ఆదిని సైడ్ చేశారు.. సుజయకృష్ణను పక్కనపెట్టారు నలుగురు మంత్రుల్లో ఇద్దరికి మళ్లీ సీటు దొరకడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు మళ్లీ జమ్మలమడుగు సీటివ్వాలని ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా వైఎస్సార్సీపీకి కంచుకోట అయిన కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో తనను బలిపశువును చేస్తున్నారంటూ ఆదినారాయణరెడ్డి తన అనుచరుల వద్ద వాపోతున్నారు. చివరకు తన చేతిలో ఓడిపోయిన రామసుబ్బారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతివ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన బావురమంటున్నట్లు తెలిసింది. ఇక విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మరో మంత్రి సుజయకృష్ణ రంగారావును అవినీతి ఆరోపణల కింద పక్కనపెట్టేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబంలోనే మరొకరిని రంగంలోకి దించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. తలకిందులైన రాజకీయ భవితవ్యం.. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ, పాడేరు–గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం– వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు– వరుపుల సుబ్బారావు, విజయవాడ పశ్చిమ– జలీల్‌ఖాన్, యర్రగొండపాలెం– డేవిడ్‌రాజు, శ్రీశైలం– బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, కోడుమూరు– మణిగాంధీ, కదిరి– చాంద్ బాషా, బద్వేలు– జయరాములు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు మళ్లీ సీట్లు దక్కే అవకాశం దాదాపు లేనట్లేనని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. కలమట వెంకట రమణ స్థానంలో పక్క జిల్లా నుంచి వేరే ఎవరినైనా పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు. ఇక గిడ్డి ఈశ్వరి స్థానంలో మాజీ మంత్రి మణికుమారి, బొర్రా నాగరాజుల పేర్లను పరిశీలిస్తున్నారు. వంతల రాజేశ్వరి బదులు చిన్నం బాబూరావు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు.. వరుపుల సుబ్బారావు స్థానంలో ఆయన కుటుంబంలోని మరొకరికి, జలీల్‌ఖాన్ స్థానంలో ఆయన కుమార్తెకు సీటు ఇచ్చే యోచనలో ఉన్నారు. బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి సీటు ఖరారు చేయకుండా ఏకంగా ఏరాసు ప్రతాప్‌రెడ్డిని రేసులోకి తీసుకొచ్చారు. మణిగాంధీకి సీటు లేదని తేల్చిచెప్పిన చంద్రబాబు.. ఆ స్థానానికి సమర్థుడిని తీసుకురావాలని జిల్లా నేతలకు సూచించడం గమనార్హం. చాంద్‌బాషా స్థానంలో ఆయన చేతిలో ఓడిపోయిన కందిగుంట ప్రసాద్, ఉప్పులేటి కల్పన స్థానంలో డీవై దాసు, వర్ల రామయ్య పేర్లను పరిశీలిస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కూడా సీటు ఖరారు చేయలేదు. దీంతో వీరందరి రాజకీయ భవితవ్యం పూర్తిగా తలకిందులైనట్లయ్యింది. యూజ్ అండ్ త్రోలో బాబు దిట్ట.. తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడంలో.. పని పూర్తయ్యాక వారిని పక్కనపడేయడంలో చంద్రబాబు దిట్ట అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పలు ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు ఏకంగా ఆయన కుమారుడు, తన బావమరిది నందమూరి హరికృష్ణను చంద్రబాబు ఉపయోగించుకోవడం.. ఆ తర్వాత అవమానాలకు గురిచేయడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అంతెందుకు ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం హరికృష్ణ కుమార్తె సుహాసినిని.. ఓడిపోతామని తెలిసి కూడా రంగంలోకి దించి బలిపశువును చేశారనే ఆవేదన టీడీపీ నాయకుల్లోనే వ్యక్తమైంది. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ వంటి ఎందరో నాయకులు బాబు ‘యూజ్ అండ్ త్రో’ విధానానికి బలైనవారే. ఇప్పుడు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన మెజారిటీ ఎమ్మెల్యేలు బాబు చక్రబంధంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత.. పార్టీలో అవమానం వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో వీరందరికీ రూ.30 కోట్లకు పైగా డబ్బులివ్వడంతో పాటు కాంట్రాక్టులు ఇస్తామని, కుదిరితే మంత్రి పదవి లేకపోతే ఇతర పదవులు ఇస్తామని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. మళ్లీ పోటీ చేసే అవకాశం కూడా కల్పిస్తామని ఆ సమయంలో చంద్రబాబు వీరికి హామీ ఇచ్చారు. ఈ విషయాలను మణి గాంధీ, గిడ్డి ఈశ్వరి వంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన జరగదని తెలిసి కూడా.. చంద్రబాబు 175 ఎమ్మెల్యేల స్థానాలు 225కి పెరుగుతాయని, కొత్తవారు పార్టీలోకి వచ్చినా ఇబ్బందేమీ ఉండదంటూ మభ్యపెట్టారు. తీరా పార్టీ ఫిరాయించిన తర్వాతి నుంచి సర్వేల్లో వెనుకబడుతున్నారంటూ వారిని వ్యూహాత్మకంగా అవమానిస్తూ వచ్చారు. ఎన్నికలు వచ్చే సరికి ఇప్పుడు వారిలో అత్యధిక మందిని పక్కనబెట్టేశారు. చంద్రబాబును నమ్మి పూర్తిగా మోసపోయామని.. తమను ఆయన కరివేపాకుల్లా పక్కనపడేశారంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద బావురమంటున్నారు. చంద్రబాబు వల్ల ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నామని.. అయినా కూడా సీట్లివ్వకుండా దగా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి రెంటికిచెడ్డ రేవడిలా తయారైందని నెత్తీనోరు బాదుకుంటున్నారు. -
ఫిరాయింపుదారులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ టికెట్‌తో గెలుపొంది అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు పొందినవారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిరాయింపుదారులపై తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత వారం దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు న్యాయ, శాసన వ్యవహారాలశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శిలకు కూడా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అమ్ముడుపోయామని స్వయంగా చెబుతున్నారు... అధికార పార్టీ నేతలు తమకు డబ్బులు, పదవుల ఆశ చూపినట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొందరు బహిరంగంగానే చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ధర్మాసనానికి నివేదించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ‘నిస్సంకోచంగా అడ్డుకట్టవేయాల్సిందే. అయితే మీ పార్టీ గతంలో ఎప్పుడూ ఫిరాయింపులకు పాల్పడలేదా?’ అని ప్రశ్నించింది. వైఎస్సార్ సీపీ 2014 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను గెలిచిందని, ఇప్పటి వరకు ఫిరాయింపులకు పాల్పడటంగానీ ప్రోత్సహించడం గానీ చేయలేదని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తమ పార్టీలోకి టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి వచ్చారని, ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేసిన తరువాతే పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు. తమ పార్టీ విలువలు ఉన్న పార్టీ అని తెలిపారు. స్పీకర్ తన విధులను నిర్వర్తించకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్యని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఎప్పటికప్పుడు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నా ఇప్పటివరకూ స్పందించ లేదన్నారు. స్పీకర్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు తప్పనిసరిగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని, అయితే సభాపతి వైపు నుంచి వాదనలు వినకుండా నేరుగా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ప్రతివాదులందరికీ నోటీసులు ఇస్తామని, అందరి వాదనలు విన్నాక తగిన ఉత్తర్వులు ఇస్తామంది. పార్టీ ఫిరాయించిన ఎంపీల పేర్లను ఈ పిటిషన్ నుంచి తొలగించి అనుబంధ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించగా పిటిషనర్ తరపు న్యాయవాది అందుకు అంగీకరించారు. ‘గతంలో చంద్రబాబు తరఫున హాజరైనందున ఈ కేసును విచారించలేను’.. సీఎం చంద్రబాబే స్వయంగా వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ను ప్రలోభ పెట్టి టీడీపీలోకి ఫిరాయించేలా చేస్తున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయనపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో వ్యాజ్యాన్ని కూడా మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. పశ్చిమ గోదావరి జిల్లా విద్యానగర్‌కు చెందిన వీర్ల సతీష్ కుమార్ దీన్ని దాఖలు చేయటం తెలిసిందే. అయితే ఈ వ్యాజ్యంలో చంద్రబాబు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉండటాన్ని గమనించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ దీన్ని విచారించేందుకు నిరాకరించారు. గతంలో తాను చంద్రబాబు తరపున వాదనలు వినిపించానని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించడం నైతికంగా భావ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని మరో ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా చంద్రబాబు ప్రతివాదిగా ఉన్నారా? అని ఈ సందర్భంగా ఏసీజే ఆరా తీశారు. ఆ వ్యాజ్యంలో చంద్రబాబు ప్రతివాది కారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఒకవేళ కావాలంటే ఆ వ్యాజ్యాన్ని కూడా మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని ఏసీజే చెప్పారు. -
ఫిరాయింపులపై హైకోర్టులో ‘పిల్’
సాక్షి, హైదరాబాద్: విపక్ష ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి పార్టీ ఫిరాయించిన వారు ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగకుండా అనర్హత వేటు వేసేలా ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లా విద్యానగర్‌కు చెందిన వీర్ల సతీష్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఫిరాయించి మంత్రి పదవులు పొందిన ఎన్.అమర్నాథ్ రెడ్డి, వెంకట సుజయకృష్ణ రంగారావు, సి.ఆదినారాయణరెడ్డి, బి.అఖిలప్రియతో పాటు ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
-
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
• ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ • జోక్యం చేసుకోండి • రాష్ట్రపతికి జగన్ వినతి ⇔ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ⇔ అవినీతి డబ్బుతో ఫిరాయింపుల ప్రోత్సాహం ⇔ ఈ జాఢ్యం అన్ని రాష్ట్రాలకు పాకుతుంది.. ⇔ స్పందించకుంటే వ్యవస్థ కుప్పకూలుతుంది.. ⇔ చంద్రబాబు పాలనపై ప్రజలకు విశ్వాసం లేదు.. ⇔ రాజీనామాలు, అనర్హతలపై జంకుతున్న బాబు ⇔ అన్ని పార్టీల నేతలనూ కలసి వివరిస్తాం.. ⇔ రాష్ట్రపతి భవన్ ఆవరణలో మీడియాతో ప్రతిపక్షనేత సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులను అరికట్టలేనిపక్షంలో అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల్లో ఇవే పరిణామాలు చోటుచేసుకుం టాయని, చివరకు ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపులు జరుగుతున్న తీరును, అనర్హత వేటు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకున్న తీరును భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గురువారం ఇక్కడ వివరించారు. వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పార్లమెం టరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వి.విజయసాయిరెడ్డి, పి.వి. మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులతో కలసి రాష్ట్రపతిని కలుసుకుని ఒక వినతిపత్రం ఇచ్చారు. అనం తరం ఆయన రాష్ట్రపతి భవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే... ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే.. ‘‘రాష్ట్రంలో అనైతికంగా, అప్రజాస్వామికంగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయా లని స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చాం. ఆ పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే మరో అడుగు ముందుకేసి ఫిరాయించిన వారిలో కొంత మందిని చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని భారత రాష్ట్రపతికి వివరిం చాం. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుందని చెప్పాం. ఇలాంటివి ఆపని పక్షంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన పరిణా మాలు ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి. అప్పు డు మంత్రులు ఏ పార్టీకి చెందిన వారన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లోకి వెళతాం. ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ఖూనీ అవు తోంది. ప్రజాస్వామాన్ని కాపాడాలని రాష్ట్రప తిని కోరాం. ఆయన సానుకూలంగా స్పందిం చారు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం.. బాబు పాలనపై ప్రజలకు విశ్వాసం లేదు.. 21 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు చూపి టీడీపీలోకి తీసుకున్నారు. వారు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హత లేదు. కానీ ప్రభుత్వం, స్పీకర్ చేయూతతో వారు కొనసాగుతున్నారు. చంద్రబాబుకు అధికారం ఉంది. డబ్బు ఉంది. పోలీసు బలం ఉంది. పూర్తి మెజారిటీ ఉంది. అయినా ఆయ నకు మా పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు కావాలి. వారిపై అనర్హత వేటు పడనీయరు. వారికి టికెట్ ఇచ్చి ప్రజల వద్దకు తీసుకువెళ్లి తీర్పు కోరరు. ఎందుకంటే ఆయనకు తెలుసు. ఎన్నికల్లో గెలవలేరని తెలుసు. ఎందుకంటే పరిపాలనలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆయనకు ఆయనపై గానీ, ఆయన పాలనపై గానీ విశ్వాసం లేదు. అందుకే ఆయన ప్రజల్లోకి వెళ్లరు. ఆయనకు ఎమ్మెల్యేలు కావాలి గానీ, వారిని టీడీపీ టికెట్‌తో గెలిపించుకోలేరు. అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా చంద్రబాబు వీరిని తమ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అందువల్ల గవర్నర్‌కు తగు ఆదేశాలు ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకున్న ఫిరాయింపుదారులను తొలగించాలని కోరాం.. బాబు అనైతికతను అన్నిపార్టీలకూ వివరిస్తాం.. వివిధ పార్టీల నేతలను కలుస్తాం. పార్టీలు స్పందించని పక్షంలో మీవరకూ వస్తుందని చెప్తాం.. మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని చెప్తాం. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పక్షంలో నాలుగడుగులు ముందుకు వేయాలని కోరతాం. మరీ ముఖ్యంగా బీజేపీ లో పార్టీ నిర్ణయాన్ని ప్రభావితం చేయగల నేతలను కూడా కలుస్తాం. బీజేపీ నేతలు కన్విన్స్ అయితే చంద్రబాబుపై మొట్టికాయ లు వేస్తారు. స్పీకర్ వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేస్తారు. అపా యింట్మెంట్ ఇస్తే అన్ని పార్టీల నేతలను కలిసి చంద్రబాబు అనైతిక చర్యలను వివరి స్తాం. ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన చంద్ర బాబు ఏరకంగా.. విచ్చలవిడిగా సంపాదిం చిన నల్లధనాన్ని ఫిరాయింపులకు ఎలా వెచ్చిస్తున్నారో వివరిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని కాగ్ తప్పుపట్టిన పరిస్థితిని ప్రస్తావిస్తాం. ఇసుక నుంచి మట్టి వరకు, మట్టి నుంచి మద్యం వరకు, మద్యం నుంచి బొగ్గు వరకు, బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల వరకు, చివరకు గుడి భూములను, గుడిలో లింగాన్ని సైతం మింగేలా అవినీతికి పాల్పడుతున్న తీరు, ఆ సంపాదించిన డబ్బుతో ఇలా ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును ప్రతిచోట చెప్తాం.. ఈ వ్యవస్థలో మార్పు తేలేనిపక్షంలో వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
తమ్ముళ్లేనట ఎమ్మెల్యేలు
ప్రత్యేక అభివృద్ధి నిధుల మంజూరులో బాబు సర్కారు అదే బరితెగింపు ఎన్నికైన ఎమ్మెల్యేల పేరు మార్చి టీడీపీ నేతల పేరుతో జీవోలు - సంతనూతలపాడులో ఎమ్మెల్యేగా జనం ఎన్నుకున్నది సురేశ్‌ని.. - కానీ బాబు సర్కారు జీవోలో ఎమ్మెల్యేగా విజయ్‌కుమార్ - నియోజకవర్గంలో సీసీ రోడ్లకు రూ.2 కోట్లు - మార్చి 31న రూ.62 కోట్లు మంజూరు చేస్తూ 31 జీవోలు జారీ - ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట్ల టీడీపీ నేతల పేర్లతో నిధుల మంజూరు - ఎస్డీఎఫ్ కాదు.. టీడీపీ డెవలప్మెంట్ ఫండ్ - తీరుమారని సీఎం.. అదే పక్షపాతం.. విస్తుపోతున్న అధికారులు సాక్షి, అమరావతి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగ నిబంధనలను, చట్టాలను తుంగలో తొక్కుతూ ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్) మంజూరు విషయంలో తన మొండితనాన్ని, దారుణమైన బరితెగింపును అదేతీరులో కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ‘నలుగురూ నవ్విపోనీ.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పేర్లను మార్చేస్తూ ఏకంగా జీవోలు జారీ చేసేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నియోజకవర్గాలలో తెలుగుదేశం నేతలనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ వారి పేరుమీదే నిధులు విడుదల చేస్తున్నారు. ఎన్నుకున్న ప్రజలను వెర్రివాళ్లన్నట్లుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇలా సంకుచితంగా.. ప్రతిపక్ష పార్టీ విషయంలో కక్షగట్టినట్లు వ్యవహరించడాన్ని అధికారులు కూడా తప్పుపడుతున్నారు. ఇవి ప్రత్యేక అభివృద్ధి నిధులా లేక తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నిధులా అని ప్రశ్నిస్తున్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేశ్ కాదట.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజక వర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎ.సురేశ్‌ను చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి సంతనూతలపాడు అసెంబ్లీ నియోజక వర్గంలో సీసీ రహదారుల నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్ వినతి మేరకు సీసీ రహదారులకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి సంజయ్‌గుప్తా జీవో ఆర్టీ.236 జారీ చేశారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎ.సురేశ్ ఎన్నికైనప్పటికీ జీవోలో మాత్రం ఎమ్మెల్యేగా ఎన్నిక కాని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి విజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయడం చూసి అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధిస్తే ఎమ్మెల్యేగా గుర్తించరా..అయినా ఇలా పేర్లు మార్చేసి ఏకంగా జీవోలు జారీ చేయడం మునుపెన్నడూ ఎరగమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బరితెగింపు చూసి నివ్వెరపోతున్నారు. ఆది నుంచీ చంద్రబాబుది అదేతీరు... ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధుల మంజూరులో ముఖ్యమంత్రి చంద్ర బాబు తొలి నుంచి వివక్షతో వ్యవహరిస్తు న్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గాల అభివృద్ధికి ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసేవారు. ఇందులో ప్రతిపక్షమా, ఇతర పార్టీలా అనే తేడా లేకుండా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఈ నిధులను మంజూరు చేసేవారు. అనంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలు జారి పోకుండా కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి విచక్షణాధికారాలతో మంజూరు చేసేలాగ ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ ప్రత్యేక నిధిని కొనసాగిస్తూ నియోజకవర్గాల అభివృద్ధి నిధికి మంగళం పాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేయకుండా వివక్షతో వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు విజ్ఞాపన పత్రాలను సమర్పించినప్పటికీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, లేదా టీడీపీ ఇన్చార్జి నాయకులనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ వారి పేరుతో నిధులను మంజూరు చేస్తున్నారు. టీడీపీ సంక్షేమ నిధిలా మార్చేశారు.. ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31వ తేదీన హడావుడిగా ప్రత్యేక అభివృద్ధి నుంచి 31 నియోజకవర్గాలకు రెండేసి కోట్ల రూపాయల చొప్పున 62 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ 31 జీవోలను జారీ చేశారు. మాడుగుల నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేను కాదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడి పేరుతో నిధులను మంజూరు చేశారు. అలాగే మార్కాపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడి పేరు తో నిధులను విడుదల చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధిని తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధిగా చంద్రబాబు సర్కారు మార్చేసింది. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్న చోట టీడీపీ ఇన్చార్జీల పేరుతో నిధులను మంజూరు చేస్తున్నారు. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ జీవోలు జారీ చేయడం ఈ ప్రభుత్వ అనైతిక, అప్రజాస్వామిక చర్యలకు పరాకాష్ట. గతంలో డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉండగా కేఈ ప్రతాప్ (డిప్యూటీ సీఎం కేఈ సోదరుడు) పేరుతో నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
'ఏడాది తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలే క్యూ కడతారు'
హైదరాబాద్: కృష్ణా జిల్లాలో ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నూజివీడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏడాది తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతారని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైందంటూ ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఎందుకు వచ్చామా అని ఇప్పుడు వారంతా బాధ పడుతున్నారని మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు.