MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ | MLC Kavitha Arrested In Liquor Scam Case Day 3 Updates | Sakshi
Sakshi News home page

MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ

Published Tue, Mar 19 2024 7:53 AM | Last Updated on Tue, Mar 19 2024 7:40 PM

MLC Kavitha Arrested In Liquor Scam Case 3rd Day Updates - Sakshi

MLC Kavitha Case Updates In Liquor Scam..

ఢిల్లీ: 
సుప్రీంకోర్టులో కవిత రిట్  పిటిషన్ దాఖలు

  • తాజా పిటిషన్‌లో కీలక అంశాలు
  • కవిత అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించారు
  • చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారు
  • కవిత అరెస్టు చట్టబద్ధం కాదు, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు 
  • పీఎంఎల్ఏ(PMLA) సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించారు
  • కవిత ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి
  • ఈడీ కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని పిటిషన్

మూడోరోజు ముగిసిన కవిత ఈడి కస్టోడియల్ ఇంటరాగేషన్ 

  • ఇండో  స్పిరిట్లో 33 శాతం వాటా ఎలా వచ్చిందని  ప్రశ్నలు అడిగిన ఈడీ 
  • 100 కోట్ల ముడుపులను ఎలా చెల్లించారని ప్రశ్నలు
  • మొబైల్ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నల వర్షం
  • విచారణ అనంతరం కవితకు వైద్య పరీక్షలు 
  • మరికాసేపట్లో కవితను కలవనున్న కేటీఆర్, న్యాయవాదులు

►తన అరెస్ట్‌ అక్రమం అంటూ పిటిషన్‌ దాఖలు చేసిన కవిత.
►తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని సీజేఐకి విజ్ఞప్తి చేసిన కవిత. 
►కవిత పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తారా? లేదా? అనే అంశంపై కొనసాగతున్న సస్పెన్స్‌. 

►కవిత పిటిషన్‌పై విచారణ 11 గంటలకు వాయిదా. అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ లేకపోవడంతో విచారణ వాయిదా. 

►కవితపై పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.

►ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంత వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దు అంటూ దాఖలైన పిటిషన్  ఉపసంహరించుకున్న కవిత తరపు న్యాయవాది.

►పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం.

►కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్‌ విక్రమ్‌ చౌదరి. 

►ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కవిత ప్రస్తుతం ఏడు రోజులు ఈడీ కస్టడీలో ఉన్నారు. లిక్కర్‌ కేసు సంబంధించి ఈడీ ఆమెను ప్రశ్నిస్తోంది. 

కవితకు లేఖ రాసిన సుఖేష్‌..

  • ఎమ్మెల్సీ కవితకు మనీలాండరింగ్ కేసు నిందితుడు  సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
  • తీహార్ జైల్ క్లబ్‌లో త్వరలో మీరు  సభ్యులు కాబోతున్నారు
  • తీహార్ జైల్ కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది   
  • అరవింద్ కేజ్రీవాల్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారు 
  • సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న అక్రమ సొమ్ము బయటపడుతుంది
  • వాట్సాప్ సంభాషణలపై దర్యాప్తు జరుగుతోంది
  • అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం చేయవద్దని నా సలహా 
  • కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు
  • ఈ కేసులో కావాల్సినన్ని సాక్షాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు
  • తీహార్ క్లబ్‌లో స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తుంటాను. 

►నేడు కవితపై ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈడీ సమన్లను కవిత సవాల్‌ చేసింది. కవిత పిటిషన్‌పై నేడు జస్టిస్‌ బేల త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

►మరోవైపు.. నేడు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను ఈడీ మూడో రోజు విచారించనుంది. 

►గత రెండు రోజులుగా ములాఖత్‌లో కవితను కలుస్తున్న  కేటీఆర్, హరీష్ రావు 

►ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే  128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేసిన ఈడీ. 

►కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రెస్ నోట్

►ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు 

►ఆస్తుల జప్తును ఆమోదించిన అడ్జుడికేటింగ్  అథారిటీ 

►మద్యం విధానం రూపకల్పనలో కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియాతో కలిసి  కుట్ర చేశారు 

►ఈ వ్యవహారంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పజెప్పడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారు

►ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారుల నుంచి ఇప్పించారు

►తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారు 

►ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం 

►245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాము 

►ఒక ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఐదు సప్లిమెంటరీ కంప్లైంట్స్ ఫైల్ చేశాం 

►కవిత ఏడు రోజుల ఈడి కస్టడీలో ఉంది 

►ఆమెను అరెస్టు చేసే సమయంలో బంధువులు మాకు ఆటంకం కలిగించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement