ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ చేరుకున్న కేటీఆర్‌, హరీష్‌ | MLC Kavitha IN ED Custody Over Liquor Scam Case Live Updates | Sakshi
Sakshi News home page

ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ నేతలు.. అప్‌డేట్స్‌

Published Sun, Mar 17 2024 8:49 AM | Last Updated on Sun, Mar 17 2024 12:54 PM

MLC Kavitha IN ED Custody Over Liquor Scam Case Live Updates - Sakshi

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో..

Updates..

ఢిల్లీ చేరుకున్న కేటీఆర్‌, హరీష్‌రావు

ఈరోజు సాయంత్రం కవితను కలవనున్న కేటీఆర్‌, హరీష్‌

విత అరెస్టు చట్టబద్ధమే: కోర్టు

  • కవితకు ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చిన సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్లో సంచలన విషయాలు
  • కవితను అరెస్టు చేయవద్దని ఎక్కడా సుప్రీంకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదు 
  • తదుపరి హియరింగ్ వరకు మాత్రమే సమన్లు ఇవ్వమని ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పింది 
  • ఆ తర్వాత రెండుసార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ కవిత సుప్రీంకోర్టులో వాటిని ఛాలెంజ్ చేయలేదు 
  • సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట తప్పారా లేదా అన్నది? మా పరిధిలో నిర్ణయించే అంశం కాదు 
  • సెక్షన్-19 ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూ అరెస్టు చేశారా లేదా అన్నది మాత్రమే చూస్తాం  
  • కవితను చట్టబద్ధంగానే అరెస్టు చేశారు 
  • మనీలాండరింగ్ చట్టం సెక్షన్-19 కింద అన్ని నిబంధనలను పాటించారు 
  • ఈ నేరాల్లో కవిత కీలక పాత్ర పోషించారనేదానికి ఆధారాలు ఉన్నాయి 
  • అందుకే ఆమెను రిమాండ్ చేస్తూ దర్యాప్తు కోసం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నాం 
  • సీసీటీవీ కవరేజ్‌లో ఆమెను విచారించాలి. 
  • సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలి 
  • మహిళను విచారించే సమయంలో తీసుకోవలసిన అన్ని నిబంధనలు పాటించాలి 
  • ఆమె తరపు న్యాయవాదులు ప్రతిరోజు అరగంట పాటు కలవవచ్చు
  • ఆమె  భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ , బావ హరీష్ రావు కజిన్ బ్రదర్స్ శ్రీధర్, ప్రణీత్ కుమార్, శరత్ కలుసుకునే అవకాశం ఉంది 
  • అరెస్టు తరువాత హైబీపీకి గురైనట్లు ఈసీజీ రిపోర్టు ఉన్న నేపథ్యంలో తగిన మందులు ఇవ్వాలి 
  • 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలి

ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కవితను కలవునున్న కేటీఆర్‌, హరీష్‌ రావు.

నేటి నుంచి కవిత కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌

  • నేటి నుంచి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కస్టోడియల్ ఇంటరాగేషన్ 
  • ప్రతిరోజు ఉదయం 10 నుంచి సా.5 గంటల వరకు ఇంటరాగేషన్ చేయనున్న ఈడీ
  • కవిత పాత్రకు సంబంధించి ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చిన   అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డి 
  • ఆమె టీంలో ఉన్న సభ్యులు ఇచ్చిన సమాచారాన్ని కవిత ద్వారా ధ్రువీకరించనున్న ఈడీ
  • గత విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కవిత తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని ఈడీ ఆరోపణ
  • ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు కుటుంబ సభ్యులను లాయర్లను కలుసుకునేందుకు అనుమతించిన కోర్టు 
  • నేడు సాయంత్రం కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు , లాయర్లు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి.

ప్రతీరోజు కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు అవకాశమిచ్చిన ‍కోర్టు.

నేడు ఢిల్లీకి వెళ్లనున్న బీఆర్‌ఎస్‌ నేతలు.

ఈడీ కస్టడీలో కవిత విచారణను వీడియో తీయనున్న ఈడీ అధికారులు. 

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఈడీ అధికారులను ఆదేశించింది.

ఇక, లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఈడీ కవితను శుక్రవారం సాయంత్రం హైదరా­బాద్‌లో అరెస్టు చేసి, ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కవితను ఈడీ అధికారులు శనివారం ఉదయం 11.30 సమ­యంలో ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరు­పర్చారు. మద్యం స్కాం కేసుకు సంబంధించి కవిత నుంచి కీలక అంశాలు రాబట్టాల్సి ఉందని, ఆమెను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

కవిత భర్త అనిల్, వ్యక్తిగత  సిబ్బందికి ఈడీ నోటీసులు..
కవిత భర్త అనిల్‌కు, ఆమె వ్యక్తిగత సిబ్బంది ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. వారిని సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు ఈ నలుగురి ఫోన్లను సీజ్‌ చేశారు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement