ఎంపీ వాహనాన్ని అడ్డుకుంటున్న టీఆర్‌ఎస్ నాయకులు
ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి యత్నించాయి. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని గన్నారంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గన్నారం గ్రామంలో నిర్మించి న పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, సీసీ కెమెరాలను ప్రారంభించడానికి ఆదివారం ఎంపీ వచ్చారు.
ధాన్యం కొనుగోళ్లు, పసుపు బోర్డు విషయంలో జిల్లా రైతులను మోసం చేస్తున్నా రని ఆరోపిస్తూ... గ్రామ ముఖద్వారం వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నా రు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఎంపీ అర్వింద్ వాహనంతో పాటు బీజేపీ మండలాధ్యక్షుడి కారు స్వల్పం గా దెబ్బతిన్నాయి. పలువురు టీఆర్‌ఎస్ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి.
హోం గార్డు రూపకళకు కాలు విరిగింది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకుని ఎంపీ వాహనాన్ని ముందుకు పంపించారు. పల్లె ప్రకృతివనం, శ్మశాన వాటిక, సీసీ కెమెరాలను ప్రారంభించిన అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, రాష్ట్ర ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని అన్నారు.
పసుపు బోర్డుకు రూ.30 కోట్ల నిధులు కేటాయించడమే కాకుండా దిగుమతులు నిలిపి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా బీజేపీ ఎదుగుదలను అడ్డుకోలేరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment