హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి(మంగళవారం) వాయిదా పడింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం అవినాష్‌రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆ విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు విచారణకు రావాలని అవినాష్‌రెడ్డికి సీబీఐ స్పష్టం చేసింది. నేటి విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్‌రెడ్డి హాజరయ్యే క్రమంలో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ మేరకు అవినాష్‌రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది.
తెలంగాణ హైకోర్టులో నేటి మధ్యాహ్నం అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉన్నందునే సీబీఐ తన విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే.
చదవండి: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment