జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణం చేయించనున్న సీజే
నేడు ఇన్‌చార్జి గవర్నర్‌ను కలవనున్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ఈ నెల 31న సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
నేడు రాధాకృష్ణన్‌ను కలవనున్న రేవంత్
రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆదివారం రాజ్‌భవన్‌కు చేరుకోగా, సోమవారం సాయంత్రం ఆయన తిరిగి వెళ్లిపోనున్నారు. గత మార్చి 20న రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులతోపాటు జీవిత ఖైదీల క్షమాభిక్షకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించారు.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ధన్యవాదాలు తెలియజేయనున్నారు. జార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రాధాకృష్ణన్‌ను కేంద్రం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment