new governor
-
తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ..
-
ప్రధాని ఫోన్ చేసి త్రిపుర వెలుపల పనిచేయాలన్నారు
అగర్తల: తెలంగాణ నూతన గవర్నర్‌గా తనను నియమించినట్లు ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పే దాకా తెలియదని బీజేపీ నేత, త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ‘ప్రధాని మోదీ శనివారం రాత్రి నాకు ఫోన్ చేశారు. త్రిపుర వెలుపల పనిచేయాల్సి ఉంటుందన్నారు. నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రధానికి చెప్పా. ఆ కాసేపటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి తెలంగాణకు స్వాగతం అన్నారు. దీంతో నేను తెలంగాణ నూతన గవర్నర్‌గా ఆ రాష్ట్రానికి వెళ్లనున్నట్లు అప్పుడు అర్థమైంది’అని జిష్ణు దేవ్ వర్మ త్రిపురలో విలేకరులకు తెలిపారు.త్రిపుర నుంచి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తి తానేనని చెప్పారు. తమ రాష్ట్రంపై ప్రధాని మోదీకి ఉన్న ఆపేక్షకు తన నియామకమే నిదర్శనమని పేర్కొన్నారు. ‘గతంలో డిప్యూటీ సీఎంగా రాజకీయ పదవీ బాధ్యతలు నిర్వర్తించా. ఇప్పుడు నాకు అప్పగించిన రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తా. ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకొని పనిచేస్తా. బుధవారం తెలంగాణకు చేరుకొని అదే రోజు గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేస్తా’అని జిష్ణు దేవ్ వర్మ వివరించారు. 2018 నుంచి 2023 దాకా త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేసిన జిష్ణు దేవ్ వర్మ.. గతేడాది జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సెఫాహిజాలా జిల్లాలోని చారిలామ్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన త్రిపుర మాజీ రాజవంశీకుల కుటుంబానికి చెందిన వారు. -
31న కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ఈ నెల 31న సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేడు రాధాకృష్ణన్‌ను కలవనున్న రేవంత్ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆదివారం రాజ్‌భవన్‌కు చేరుకోగా, సోమవారం సాయంత్రం ఆయన తిరిగి వెళ్లిపోనున్నారు. గత మార్చి 20న రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులతోపాటు జీవిత ఖైదీల క్షమాభిక్షకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ధన్యవాదాలు తెలియజేయనున్నారు. జార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ ఇన్చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రాధాకృష్ణన్‌ను కేంద్రం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. -
తెలంగాణ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ
-
అందరి వాణి వింటా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలకు రాజ్‌భవన్ అత్యంత నిబద్ధతతో నిర్విరామ సహకారం అందిస్తుందని రాష్ట్ర నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. తాను అందరి వాణిని వింటానని, ప్రతి ఆందోళనను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఎల్లవేళలా సమర్థిస్తూ, గౌరవించేలా, అత్యంత శ్రద్ధతో తన విధులను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేశారు. న్యాయం, సమగ్రత, నిష్పాక్షికత సూత్రాలకు కట్టుబడి దృఢ నిబద్ధతతో పనిచేస్తానన్నారు. రాష్ట్రం, ప్రజల అభ్యున్నతికి అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో పని చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మూడో గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ గవర్నర్లు సీహెచ్ విద్యాసాగర్‌రావు, రామ్మోహన్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ ప్రసంగించడంతో పాటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ సందేశాన్ని విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రజల అవసరాలు, ఆకాంక్షలను పరిష్కరించడానికి ప్రాధాన్యతనివ్వాలని అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలకు రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, న్యాయం, కరుణ అనే సూత్రాల ఆధారంగా మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గొప్ప చరిత్ర, సంస్కృతి, పటిష్ట ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రమని, వ్యవసాయం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో విశేష ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ గవర్నర్‌గా పని చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కొత్త గవర్నర్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గంతో గవర్నర్ గ్రూపు ఫోటో దిగారు. ఇంతకుముందు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్‌కు అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చార్మినార్: గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానంతరం బుధవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణితో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. యాదాద్రి మరో వెయ్యేళ్లు నిలుస్తుంది యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని గవర్నర్ అన్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, మరో వెయ్యేళ్లు అద్భుతంగా నిలుస్తుందని చెప్పారు. గర్భాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఒళ్లు పులకరించిందని అన్నారు. అంతకుముందు గవర్నర్‌కు సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ హనుమంత్ కె.జండగే, ఇతర అధికారులు, అర్చకులు తూర్పు త్రితల రాజగోపురం ముందు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను గవర్నర్ దర్శించుకున్నారు. ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. సీఎస్ శ్రీస్వామి వారి చిత్రపటాన్ని అందజేయగా, ఈవో భాస్కర్‌రావు లడ్డూ ప్రసాదం ఇచ్చారు. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీపుష్ప యాగం వేడుకలో గవర్నర్ పాల్గొన్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద మొక్కి, సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని రాసి సంతకం చేశారు. -
విజయవాడ: రాజ్‌భవన్‌కు సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
నూతన గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: నూతన గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాజ్‌భవన్‌లో గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రేపు(శుక్రవారం) ఏపీ గవర్నర్‌గా అబ్ధుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. చదవండి: పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది? -
ఉత్తరాఖండ్ గవర్నర్‌గా గుర్మీత్ సింగ్ ప్రమాణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేబినెట్ మంత్రులు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్, డీజీపీ అశోక్ కుమార్ ఇతర అధికారులు హాజరయ్యారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్న బేబి రాణి మౌర్య ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. గుర్మీత్ సింగ్ గతంలో భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పని చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి సైనికుడిగా సేవలందించాక, ఉత్తరాఖండ్‌కు గవర్నర్‌గా పని చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని అన్నారు. ఉత్తరాఖండ్‌లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఓ సైనికుడు ఉన్నాడని, అందుకే రాష్ట్రానికి వీరభూమి అనే పేరుందని అన్నారు. రిటైర్ అయిన సైనికులు, ప్రాణాలు కోల్పోయిన సైనికులు, వారిపై ఆధారపడిన వారికి కుటుంబాలకు సాయం అందించడం తన ప్రాధమ్యమని చెప్పారు. గవర్నర్ కార్యాలయం ద్వారా ప్రజల అంచనాలను పెంచుతానని వ్యాఖ్యానించారు. -
వజూభాయ్కు విశ్రాంతి.. కొత్త గవర్నర్ గెహ్లాట్
సాక్షి బెంగళూరు: కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ కర్ణాటక కొత్త గవర్నర్‌గా రాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుత గవర్నర్ వజుభాయి వాలా పదవీకాలం చాలా నెలల క్రితమే ముగిసినా పొడిగిస్తూ వస్తున్నారు. ఆ పొడిగింపు కూడా ఈ ఆగస్టుతో ముగియనుంది. అనంతరం ఆయన స్థానంలో 73 ఏళ్ల గెహ్లాట్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. స్వస్థలం మధ్యప్రదేశ్ గెహ్లాట్ మధ్యప్రదేశ్‌లోని రుపేటా గ్రామంలో 1948, మే 18న దళిత కుటుంబంలో జన్మించారు. విక్రం విశ్వవిద్యాలయంలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. సోషల్ సైన్సెస్‌లో గౌరవ డాక్టరేట్ పొందారు. బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సజాపూర్ లోక్‌సభ స్థానం నుంచి 1996–2009 మధ్య ఎంపీగా పలుమార్లు గెలుపొందారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014 నుంచి పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుత గవర్నర్ వజూభాయ్ వాలా 2014, సెప్టెంబరులో గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు ఆయన గుజరాత్ ఆర్థిక మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితునిగా పేరుంది. -
తెలంగాణకు కొత్త గవర్నర్..
-
8న కొత్త గవర్నర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్ ఈ నెల 8న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్.చౌహాన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తమిళిసై రెండో గవర్నర్, తొలి మహిళా గవర్నర్ కాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ నియామకాన్ని ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఈ నెల 7న బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. -
కొత్త గవర్నర్‌కు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాభినందనలు తెలిపారు. ఆమెతో ఆదివారం ఫోన్లో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు. హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కూడా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పలువురి శుభాకాంక్షలు రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్‌కు, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తా త్రేయకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకాలం తెలంగాణకు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్‌కు వారంతా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి/తిరుమల/గన్నవరం/భవానీపురంఔ(విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌కు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన సతీమణి సుప్రభ హరిచందన్‌తో కలసి తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రన్‌వే వద్ద హరిచందన్‌ను ముఖ్యమంత్రి జగన్ శాలువాతో సత్కరించి.. పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. తదుపరి ఇంటర్నేషనల్ టెర్మినల్ ఆవరణలో నూతన గవర్నర్ ఏబంపీ పోలీస్ ప్రత్యేకదళం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు తానేటి వనిత, కొడాలి వెంకటేశ్వరరావు, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్‌ను, ఉన్నతాధికారులను కొత్త గవర్నర్‌కు సీఎం జగన్ ఈ సందర్భంగా పరిచయం చేశారు. స్వాగత కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, జీఎడీ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఐఏఎస్ అధికారులు సతీష్‌చంద్ర, జేఎస్వీ ప్రసాద్, విజయవాడ సీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఇంకా పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి విశ్వభూషణ్ దంపతులు విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తదుపరి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. శ్రీవారి దర్శనం.. కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హరిచందన్ దంపతులు వయోవృద్ధుల క్యూలో ఆలయంలోనికి ప్రవేశించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి వారిని సాదరంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించుకుని వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో హరిచందన్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల ప్రత్యేకాధికారి కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం ఆలయం వెలుపల హరిచందన్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం దివ్యానుభూతిని కలిగించిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ చాలా బాగుందని కితాబిచ్చారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన వరాహస్వామివారిని దర్శించుకున్నారు. నేడు ప్రమాణ స్వీకారం.. రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ పదవీ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుక కోసం రాజ్‌భవన్ ముస్తాబైంది. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రవ్యాప్తంగా 461 మంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సీఎంవో కార్యాలయ అధికారులు, గవర్నర్ కార్యాలయ అధికారులు ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వెయ్యిమంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి కేవలం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి వాహనాల్నే అనుమతిస్తామని, ఇతర వీవీఐపీల వాహనాలు రాజ్‌భవన్ ముందే ఆపాలని, అక్కడినుంచి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ కార్లలో లోపలికి తీసుకెళతామని తెలిపారు. ఆహ్వానితులందరూ 10.45 గంటల్లోగా ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, గవర్నర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
24న నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ గవర్నర్‌తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అతిథులకు రాజ్‌భవన్ అధికారులు తేనీటి విందు ఏర్పాటు చేశారు. హరిచందన్ ఈ నెల 23 రాత్రికి రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయంలో రాజ్‌భవన్ ఏర్పాటు పనులను శనివారం ఆయన పరిశీలించారు. సీఎస్‌తో పాటు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, జీఏడీ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ మిషాసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కొత్త గవర్నర్ ఈ నెల 23న భువనేశ్వర్ నుంచి తిరుమల వెళ్లి, శ్రీవారి దర్శనం అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని తెలిపారు. అక్కడ రాష్ట్ర ప్రథమ పౌరుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, అధికారులు స్వాగతం పలకనున్నారని తెలిపారు. త్రివిధ దళాల స్వాగతం.. మొదటిసారిగా రాజధానికి రానుండడంతో గవర్నర్‌కు త్రివిధ దళాలు ఆర్మీ సెరిమోనియల్ స్వాగతం పలకనున్నాయి. తర్వాత హరిచందన్ కనకదుర్గమ్మ గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. గవర్నర్ సూచనమేరకు రాజ్‌భవన్‌కు అధికారులు తగిన మార్పులు చేస్తున్నారు. భవనం మొదటి అంతస్తులో గవర్నర్ నివాసాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. రాజ్‌భవన్‌కు నలువైపులా సెక్యురిటీ పోస్టులను ఏర్పాటు చేసి, లైటింగ్ పెంచాలని అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. శాసనసభ, మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి స్పీకర్, చైర్మన్లకు లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నామని సీఎస్ చెప్పారు. -
ఆర్బీఐ కొత్త గవర్నర్‌పై త్వరలోనే ప్రకటన
న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టి సారించింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి జైట్లీ గురువారం ప్రధాని మోదీతో ఇదే అంశంపై చర్చలు జరిపారు. ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లిన జైట్లీ... ప్రస్తుత గవర్నర్ రాజన్ స్థానంలో నియమించేందుకు అర్హులైన వారి పేర్ల గురించి తెలిపినట్లు భావిస్తున్నారు. రాజన్ మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 4తో ముగుస్తుంది. తదుపరి గవర్నర్‌పై ప్రకటన గురించి విలేకరులు జైట్లీని ప్రశ్నించగా... నిర్ణయించిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఆర్థిక మంత్రితో సంప్రదింపుల తర్వాతే ప్రధాని ఆర్బీఐ గవర్నర్‌ను ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోంది. -
తమిళనాడు కొత్త గవర్నర్‌గా శంకరమూర్తి?
-
ధరలపై పోరు కీలకం కావాలి...
* ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ * ఇదే విధానం కొనసాగుతుందన్న విశ్వాసం ముంబై: ద్రవ్యోల్బణం కట్టడే దేశాభివృద్దికి కీలకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం స్పష్టం చేశారు. తన పదవీ విరమణ తరువాత బాధ్యతలు చేపట్టే ఆర్బీఐ కొత్త చీఫ్, అలాగే ఏకాభిప్రాయం ప్రాతిపదికన కీలక రేటు నిర్ణయానికి ఏర్పడబోతున్న ప్రతిపాదిత పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నిలువరించడంపైనే దృష్టి సారిస్తాయన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను అందుబాటులో ఉంచడం, అలాగే ఏకాభిప్రాయ ప్రాతిపదికన రేటు నిర్ణయానికి ఎంపీసీ ఏర్పాటు కేంద్రం తీసుకున్న కీలక చర్యలుగా వివరించారు. ఇక్కడ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రిసెర్చ్ సంస్థలో ‘ద్రవ్యోల్బణంపై పోరు... పరపతి విధాన వ్యవస్థలో పటిష్టత’ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే.. ఒడిదుడుకులను భారత్ తట్టుకుంటుందని వివరించారు. ఎంపీసీ ఏర్పాటు విప్లవాత్మకం ఎంపీసీ ఏర్పాటు నిజంగా ఒక విప్లవాత్మకమైన అడుగని రాజన్ అన్నారు. దేశంలో పలు సంవత్సరాల నుంచి అధిక ద్రవ్యోల్బణం సమస్య ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతికూల వాస్తవ వడ్డీరేటు ధోరణి అన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపిందని వివరించారు. ఈ నేపథ్యంలో తగిన గణాంకాల రూపకల్పన, ఏకాభిప్రాయం ప్రాతిపదికన తగిన రేటు నిర్ణయం దిశలో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు, ఎంపీసీల ఏర్పాటు కీలకమని వివరించారు. గత మూడేళ్లుగా ద్రవ్యోల్బణంపై జరుపుతున్న పోరాటం ఫలితంగా పలు ఆర్థిక అంశాల్లో స్థిరత్వం నెలకొందని పేర్కొన్నారు. మన పరపతి విధాన లక్ష్యాల పట్ల పెట్టుబడిదారుల విశ్వాస్వాన్ని పెంపొందించడానికి ‘స్థిర రూపాయి విలువ’ దోహదపడుతుందని రాజన్ ఈ సందర్భంగా వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల భారీ పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థ అన్ని స్థాయిల్లో భారీ ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ద్రవ్యలోటు కట్టడి ఆర్థికవృద్ధిలో కీలకమని అన్నారు. త్వరలో రాజన్ వారసుని పేరు! రాజన్ తరువాత ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి పేరును త్వరలో కేంద్రం ప్రకటిస్తుందని సంబంధిత అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. కొత్త గవర్నర్ నియామకానికి ప్యానల్ ఏర్పాటు వంటి ఊహాగానాలను ఒక సీనియర్ అధికారి కొట్టిపారేస్తూ... అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టంచేశారు. అనవసర ఊహాగానాలకు తావివ్వకుండా ముందస్తుగానే కొత్త గవర్నర్ ఎవరన్న ప్రకటన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 4న రాజన్ పదవీ విరమణ చేయనున్నారు. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య సహా పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. -
కేరళ నూతన గవర్నర్ ఎవరు?
1. 2014 సెప్టెంబర్‌లో భారతదేశంలో పర్యటించిన టోనీ అబాట్ ఏ దేశ ప్రధాని? ఎ) కెనడా బి) యూకే సి) న్యూజిలాండ్ డి) ఆస్ట్రేలియా 2. 96 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ టెన్నిస్ సెమీ ఫైనల్ చేరిన జపాన్ క్రీడాకారుడు ఎవరు? ఎ) హీరోకి కోండో బి) కీ నిషికోరి సి) హీరోకి మొరియో డి) తకావో సుజుకీ 3. 2014 సెప్టెంబర్‌లో కేరళ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎ) జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ బి) జస్టిస్ ముకుల్ ముద్గల్ సి) జస్టిస్ పి.సదాశివం డి) జస్టిస్ ఎమ్.బి.షా 4. తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? (2014, సెప్టెంబర్ 28 నుంచి 14 నెలల పాటు పదవిలో కొనసాగుతారు) ఎ) జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ బి) జస్టిస్ దీపక్ మిశ్రా సి) జస్టిస్ మదన్ లోకూర్ డి) జస్టిస్ హెచ్.ఎల్.దత్తు 5. 2014 సెప్టెంబర్‌లో హరారేలో జరిగిన ముక్కోణపు క్రికెట్ టోర్నీని ఏ దేశం గెలుచుకుంది? ఎ) జింబాబ్వే బి) దక్షిణాఫ్రికా సి) ఆస్ట్రేలియా డి) న్యూజిలాండ్ 6. 2014 ఆసియా కప్ క్రికెట్ ఏ దేశంలో జరిగింది? ఎ) శ్రీలంక బి) పాకిస్థాన్ సి) భారత్ డి) బంగ్లాదేశ్ 7. జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సమావేశం 2014 ఫిబ్రవరిలో ఏ నగరంలో జరిగింది? ఎ) సిడ్నీ బి) మాస్కో సి) లండన్ డి) సియోల్ 8. హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఇటీవల భారత్‌లో పర్యటించారు. ఆయన ఏ దేశానికి రాజు? ఎ) ఒమన్ బి) బహ్రెయిన్ సి) సౌదీ అరేబియా డి) ఎమన్ 9. మటెయో రెంజీ ఏ దేశానికి ప్రధాని? ఎ) పోర్చుగల్ బి) ఫ్రాన్స్ సి) ఇటలీ డి) పోలండ్ 10. విశ్వవిఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ రాసిన ఏకైక పుస్తకం? ఎ) ద గ్రేట్ డిక్టేటర్ బి) సిటీ లైట్స్ సి) ద కిడ్ డి) ఫుట్‌లైట్స్ 11. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014కు ఏ తేదీన లోక్‌సభ ఆమోదం తెలిపింది? ఎ) ఫిబ్రవరి 16 బి) ఫిబ్రవరి 17 సి) ఫిబ్రవరి 18 డి) ఫిబ్రవరి 15 12. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు? ఎ) నీషమ్ బి) బ్రెండన్ మెక్‌కలమ్ సి) రూథర్‌ఫోర్డ్ డి) రాస్ టేలర్ 13. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఎ) ఫిబ్రవరి 11 బి) మార్చి 11 సి) మార్చి 21 డి) ఫిబ్రవరి 21 14. {పముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ సంస్థ వాట్స్‌యాప్‌ను కొనుగోలు చేసిన సంస్థ? ఎ) మైక్రోసాఫ్ట్ బి) యాపిల్ సి) ఫేస్బుక్ డి) గూగుల్ 15. వాట్స్‌యాప్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు? ఎ) జాన్ కౌమ్ బి) స్టీవ్ జాబ్స్ సి) టిమ్ కుక్ డి) లారీ పేజ్ 16. ఇటీవల ఏ భాషకు ప్రాచీన భాష హోదా దక్కింది? ఎ) బెంగాలీ బి) హిందీ సి) ఒడియా డి) మణిపురి 17. భారతదేశంలో ఎన్ని భాషలకు ప్రాచీన హోదా ఉంది? ఎ) అయిదు బి) ఆరు సి) ఏడు డి) నాలుగు 18. 2014-15లో భారత ఆర్థిక వృద్ధి రేటు 5.4 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేసిన సంస్థ ఏది? ఎ) ప్రపంచ బ్యాంకు బి) ఆసియా అభివృద్ధి బ్యాంకు సి) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ డి) పైవేవీ కావు 19. ఆసియా అభివృద్ధి బ్యాంకు పరిపాలనా ట్రైబ్యునల్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయురాలు? ఎ) లక్ష్మీ స్వామినాథన్ బి) అర్చనా భార్గవ సి) రంజనా దేశాయ్ డి) ఉషా థొరాత్ 20. భారతదేశంలోని ఓటర్ల సంఖ్య ఎంత? ఎ) 95.55 కోట్లు బి) 81.45 కోట్లు సి) 91.55 కోట్లు డి) 85.45 కోట్లు 21. 2014 ఫిబ్రవరిలో హాకీ ఇండియా లీగ్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టు? ఎ) ఢిల్లీ వేవ్ రైడర్స్ బి) పంజాబ్ వారియర్స్ సి) ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ డి) రాంచి రైనోస్ 22. ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఎ) అలెగ్జాండర్ నిడొవ్ యెసెవ్ బి) లియాండర్ పేస్ సి) సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ డి) రోహన్ బొపన్న 23. 2014 ఫిబ్రవరిలో రష్యాలోని సోచి నగరంలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో 13 స్వర్ణాలతో అగ్రస్థానంలో నిలిచిన దేశం? ఎ) నార్వే బి) రష్యా సి) కెనడా డి) యూఎస్ఏ 24. 2018 వింటర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరుగుతాయి? ఎ) ఆస్ట్రియా బి) నార్వే సి) జపాన్ డి) దక్షిణ కొరియా 25. {బహ్మోస్ క్షిపణి రూపశిల్పి శివథాను పిళ్లైను ఏ దేశ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్’తో సత్కరించింది? ఎ) యూకే బి) రష్యా సి) జర్మనీ డి) ఫ్రాన్స్ 26. 2014, ఫిబ్రవరి 26న రాజీనామా చేసిన నావికాదళం చీఫ్ ఎవరు? ఎ) విష్ణు భగవత్ బి) ఎన్కే వర్మ సి) డీకే జోషి డి) శేఖర్ సిన్హా 27. ఇటీవల భారత్‌లో పర్యటించిన రష్యా ఉప ప్రధాని ఎవరు? ఎ) డిమిత్రి మెద్వదేవ్ బి) డిమిత్రి రొగోజిన్ సి) సెర్గీ గ్లాజ్ఏవ్ డి) మైకోలా అజరోవ్ 28. ఏ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా దినేశ్ సరాఫ్ 2014 ఫిబ్రవరిలో నియమితులయ్యారు? ఎ) ఓఎన్జీసీ బి) ఐఓసీ సి) హెప్పీసీఎల్ డి) బీపీసీఎల్ 29. 2014, ఫిబ్రవరి 26న ప్రమాదానికి గురైన భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి ఏది? ఎ) ఐఎన్ఎస్ అశ్వని బి) ఐఎన్ఎస్ సింధు రక్షక్ సి) ఐఎన్ఎస్ సింధురత్న డి) ఐఎన్ఎస్ వికాంత్ 30. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల నియమించింది? ఈ సంస్థ ఎక్కడ ఉంది? ఎ) జైపూర్ బి) ముంబై సి) కర్నాల్ డి) ఆగ్రా 31. దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలాకు భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డును ప్రదానం చేసింది? ఎ) 1993 బి) 1994 సి) 1990 డి) 1988