
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాభినందనలు తెలిపారు. ఆమెతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు. హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కూడా కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
పలువురి శుభాకాంక్షలు
రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్‌కు, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తా త్రేయకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకాలం తెలంగాణకు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్‌కు వారంతా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment