రూ.1.5 కోట్లు డిమాండ్
ఏడుగురు నిందితుల అరెస్టు
మణికొండ: హైదరాబాద్ నగర శివారులో భూముల ధరలు పెరిగిపోతుండటంతో వాటిపై వివాదాలు సృష్టించి రూ.కోట్లు దండుకునేందుకు కొన్ని ముఠాలు యత్నిస్తున్నాయి. ఇటీవల నార్సింగి రెవెన్యూ పరిధిలోని బృందావన్ కాలనీలో ఓ ప్లాట్ వివాదం ఏకంగాఎమ్మార్పీఎస్ నాయకుడి కిడ్నాప్ సంఘటన మరువకముందే మరో ఉదంతం వెలుగులోకి వచి్చంది.
ఓ ప్లాటు ప్రహరీ కూల్చి దానిని కబ్జా చేయటంతో పాటు అది ఖాళీ చేయాలంటే రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఠాను నార్సింగి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచిరేవులలో ఎన్. మాధవీలత 2003లో 1200గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది.
2017లో దాని చుట్టూ ప్రహరీ నిర్మించి తను అమెరికాలో ఉండటంతో తన తల్లి అరుణకు జీపీఏ ఇచ్చింది. ఈనెల 1న పెంజర్ల సుమన్, ఉప్పరి ముత్యాలు అనే వ్యక్తులు ప్రహరీని కూల్చి సదరు స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసి కబ్జాకు పాల్పడ్డారు. కంటైనర్ తొలగించి తాము తప్పుకోవాలంటే రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్. అరుణ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు ప్లాట్ వద్ద ఉన్న పెంజర్ల సుమన్, ఆదిరాల గౌతమ్, మేడిపల్లి గణేష్, జంగం ప్రశాంత్, ఈడిగ శివకుమార్, పెంజర్ల జయప్రకాశ్, జంగం శంకర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment