మౌనంగా ఉండటమే అసలైన సమస్య
మెజారిటీ, మైనారిటీ రాజకీయ నాయకుల సృష్టి
ఒకరిపై ఒకరికి భయం సృష్టించడమే వారి లక్ష్యం
మంథన్ సంవాద్‌లో పలువురు వక్తల అభిప్రాయం
ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలన్నా, దానిని కాపాడుకోవాలన్నా మేధావులు చర్చిస్తేనే సాధ్యం అవుతుందని మంథన్ సంవాద్ వేదికగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘మంథన్ సంవాద్’ 13వ ఎడిషన్ బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికపై జరిగింది.
మేధావులను ఒకే వేదికపైకి తీసుకొచి్చ, వారి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంథన్ 2005 నుంచి అక్టోబర్ 2న ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 470 కార్యక్రమాలు జరిగాయి.
సింగర్ అనూజ్ గుర్వారా, నటుడు అజీజ్ నజీర్, సబాఖాన్ సహా 1,500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.8 మంది వక్తలు పలు అంశాలపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు. – సాక్షి, హైదరాబాద్
ముస్లిం జనాభా పెరుగుతుందనేది ఒక అపోహ: ఖురేషీ
దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందనేది ఒక అపోహ మాత్రమేనని కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్ ఖురేషీ చెప్పారు. మంథన్ సంవాద్‌లో భాగంగా ‘దేశంలో ము స్లిం జనాభా పెరుగుదల–అపోహలు’అనే అంశంపై ఆయన మాట్లాడారు. 1951 నుంచి 2011 వరకు జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభా 13.6 కోట్లకు, హిందువుల జనాభా 67.6 కోట్లకు చేరిందని వివరించారు. ఈ గణాంకాలు చూస్తే..దేశ జనాభా పెరిగేందుకు హిందువులు కారణమని చెప్పారు.
అదే కాలంలో హిందూ, ముస్లింల మ« ద్య జనాభా గ్యాప్ 26.7 కోట్ల నుంచి 80.8 కోట్లకు పెరిగిందన్నారు. హిందువులను ముస్లిం జనాభా దాటేస్తుందనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఎక్కువ మంది జనాభాను కనాలని ఏ ముస్లిం నాయకుడు కానీ, మేధావి కానీ పిలుపునివ్వలేదని గుర్తు చేశారు. కుటుంబ నియంత్రణను ఖురాన్ ఎక్కడా నిషేధించలేదన్నారు.
ఒకే దేశం–ఒకే ఎన్నిక అసంబద్ధం : అరవింద్ దాతార్
ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ప్రతిపాదన అసంబద్ధమైనదని సీనియర్ అడ్వొకేట్ అరవింద్ దాతార్ అన్నారు. దీనివల్ల దేశంలో రాజ్యంగా సంక్షోభం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘75 ఏళ్ల రాజ్యాంగం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ అవసరంపై చర్చ జరగాలన్నారు. గవర్నర్లు ప్రతి బిల్లుకు కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెట్టడం సరికాదని చెప్పారు. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు గవర్నర్ వ్యవస్థను వాడుకోవడమేంటని ప్రశ్నించారు.
మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం: కిరణ్‌రావు
ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావొద్దంటే.. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్‌రావు సూచించారు. ‘లింగ దృష్టి కోణం’అనే అంశంపై ఆమె ప్ర సంగించారు. సినిమాల్లో స్త్రీల ను చూపించే విధానంలో మార్పులు రావాలని, అయితే మహిళల సమస్యల గురించి మహిళా డైరెక్టర్లతోపాటు కొందరు పురుషులు కూడా అద్భుతంగా తెరకెక్కించారని కిరణ్‌రావు పేర్కొన్నారు.
పురుషులు కూడా చాలా సున్నితమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి గురించి కూడా చర్చించాలన్నారు. తనకు వనపర్తి అంటే చాలా ఇష్టమని, తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్తుంటానని చెప్పారు. హై దరాబాద్‌తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే : శశికాంత్
మెజారిటీ, మైనారిటీ అనే అంశాన్ని రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ పేర్కొన్నారు. మెజారిటీ ప్రజలకు మైనారిటీలంటే లేనిపోని భయాలు కల్పించి ఎన్నికల్లో గెలుపొందడమే వారి లక్ష్యమని చెప్పారు. ‘కౌంటరింగ్ మెజారిటేరియనిజం–తీసుకోవాల్సిన చర్యలు’అనే అంశంపై ఆయన మాట్లాడారు.
మెజారిటేరియనిజం అనేదే పెద్ద నకిలీదని, దీని వల్ల మెజారిటీ ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో గుళ్లలోకి కొన్ని కులాలను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రీయంగా ముందుకు వెళ్లాల్సింది పోయి.. తిరోగమనం చెందడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కుటుంబం నుంచే రాజకీయాలు మాట్లాడకుండా తల్లిదండ్రులు పిల్లలను పెంచుతున్నారన్నారు.
పార్లమెంటరీవ్యవస్థ నాశనం సంజయ్‌సింగ్
దేశంలో పార్లమెంటరీ వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ఆమ్‌ఆద్మీ ఎంపీ సంజయ్‌సింగ్ విమర్శించారు. ఎంపీలను సస్పెండ్ చేసి, నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ‘పార్లమెంట్ వ్యవస్థ పతనం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. పదేళ్ల యూపీఏ హయాంలో 150 మంది ఎంపీలను మాత్రమే సస్పెండ్ చేశారని, వారిలో 50 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారని చెప్పారు.
గత పదేళ్ల మోదీ పాలనలో 250 మందికిపైగా ఎంపీలను సస్పెండ్ చేస్తే వారిలో ఒక్కరంటే ఒక్క బీజేపీ ఎంపీ లేకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారని, బయటకు వచ్చి మాట్లాడితే ఈడీ, సీబీఐతో దాడులు జరిపించి, జైలుకు పంపుతున్నారని ఆరోపించారు.
అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరగానే.. సత్యహరిశ్చంద్రులుగా మారుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రభుత్వం నడవకుండా చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment