
ఫైల్ ఫోటో
గార: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధి పాకాల ఏటిపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ కాన్వాయ్‌లను మండల అఖిలపక్షం నాయకులు ఆదివారం గార్లచెక్ డ్యాం వద్ద అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వంతెన నిర్మాణం హామీ నెరవేర్చాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అఖిలపక్ష నాయకులతో చర్చలు జరిపారు. వంతెన నిర్మాణానికి రూ.24 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, త్వరలో నిధులు విడుదల కాగానే నిర్మాణ పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. అయినా వారు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment