
బచ్చన్నపేట: టీ తాగి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మణ్‌రావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన దాసారం మల్లయ్య ఇంటికి హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరుడు భిక్షపతి వచ్చాడు. ఉదయం మల్లయ్య భార్య అంజమ్మ.. భర్త, మరిదికి టీ ఇచ్చింది. అనంతరం తానూ తాగింది. కాసేపటికి ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వారి కుమారుడు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అంజమ్మ మృతి చెందింది. మల్లయ్య, భిక్షపతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, టీ పొడిలో విషపు గుళికలు ఉన్నట్లుగా గుర్తించామని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment